Prasanth Varma to helm superhero film Hanu-Man ‘హనుమాన్’ తన తదుపరి ప్రాజక్టును ప్రకటించిన ప్రశాంత్ వర్మ

Filmmaker prasanth varma announces hanu man first telugu superhero movie

HanuMan, HanuMan poster, HanuMan teaser, Prasanth Varma, Prasanth Varma hanuman, Prasanth Varma superhero movie, hanuman film, hanuman release date, Hanuman, prashanth varma, Aa, Kalki, Zombie Reddy, Zombie Varma, Original Super Hero, Tollywood, Movies, Entertainment

Telugu writer-director Prasanth Varma, who is celebrating his birthday today, has announced ‘the first original superhero film in Telugu’. Titled Hanu-Man, the movie is also supposed to introduce a cinematic universe of superheroes.

ప్రశాంత్ వర్మ ఒరిజినల్ సూపర్ హీరో ప్రాజెక్టు ‘హనుమాన్’

Posted: 05/29/2021 02:20 PM IST
Filmmaker prasanth varma announces hanu man first telugu superhero movie

యువ దర్శకులలో తన రూటును సపరేటుగా మార్చుకుని వైవిధ్యభరిత చిత్రాలను రూపోందిస్తునన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన ప్రతీ చిత్రంపై తనదైన ముద్రను భిన్నంగా చూపించడానికి ఇష్టపడి తపన పడే దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగానే ఆయన వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. 'అ' .. 'కల్కి' .. 'జాంబి రెడ్డి' సినిమాలను పరిశీలిస్తే, ఒక జోనర్ కు మరో జోనర్ సంబంధం లేని కథలను ఆయన ఎంచుకుంటూ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతూ మరో కొత్త జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన తాజా ఎనౌన్స్ మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ రోజున ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా తన నుంచి కొత్త అప్డేట్ ఉంటుందని ఆయన నిన్ననే చెప్పాడు. అందులోనూ ఒరిజినల్ సూపర్ హీరోకు సంబంధించిన కథనే తాను తెలుగులో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రశాంత్ వర్మకు నచ్చిన ఒరిజినల్ సూపర్ హీరో ఎవరబ్బా అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక చెప్పినట్టుగానే కొంత సేపటిక్రితం ఆయన ఒక వీడియో వదిలాడు. తన తాజా చిత్రం 'హనుమాన్' అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.

దీంతో గత కొన్ని గంటలుగా అయన ఇచ్చిన సస్పెన్స్ కు తెరవీడింది. అయితే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు.  టైటిల్ ను బట్టి చూస్తుంటే హనుమంతుడి అంశతో జన్మించినవారో .. అనుగ్రహం పొందినవారో చేసే విన్యాసాలకు సంబంధించినదిగా అనిపిస్తోంది. బహుశా ఇది పిల్లలను ఆకట్టుకునే కేటగిరీలోకి వస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hanuman  prashanth varma  Aa  Kalki  Zombie Reddy  Zombie Varma  Original Super Hero  Tollywood  

Other Articles