'Acharya' to hit the floors in July again? జూలైలో మెగాస్టార్ ఆచార్య చివరి షెడ్యూల్ షూటింగ్

Megastar chiranjeevi s acharya to hit the floors in july again

Chiranjeevi, Aacharya, covid-19, second wave, Koratala Siva, Aacharya movie, Aacharya telugu movie, Chiranjeevi, Chiranjeevi movies, Koratala Siva, Ramcharan, Kajal Agarwal, Pooja Hegde, Kokapet, Sonu sood, Tollywood, Movies, Entertainment

Aacharya starring Megastar Chiranjeevi under the direction of flopless director Koratala Siva is undoubtedly one of the highly anticipated movies in Tollywood at the moment.

జూలైలో మెగాస్టార్ ఆచార్య చివరి షెడ్యూల్ షూటింగ్

Posted: 05/28/2021 04:47 PM IST
Megastar chiranjeevi s acharya to hit the floors in july again

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. పలు సందేశాత్మక చిత్రాలను రూపోందించే కొరటాల చిత్రంలో మెగాస్టార్ నటిస్తున్న నేపథ్యంలో చిత్రంపై ఇప్పటికే ఓ రేంజ్ దాటిన అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్నారని, తండ్రి కొడుకులు కలసి ఈ చిత్రంలో నటిస్తున్నారన్న వార్త చిత్రంపై అంచనాలను మరింత స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ వార్తతో అటు మెగా అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అదిరిపోయే రేంజ్ లో వుంది. ‘‘ఈ 'ఆచార్య' పాఠాలు కాదు .. గుణపాఠాలు చెబుతాడని’’ మెగాస్టార్ పలికిన డైలాగ్ తో అభిమానులు సంబరపడుతున్నారు. ఆచార్చ చిత్రంలో చిరంజీవి నటిస్తున్న పాత్ర స్వభావాన్ని కొరటాల ముందుగానే చెప్పేశారు. చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. 'కోకాపేట'లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. జులైలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసి, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ కి వెళ్లనున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ramcharan  Kajal Agarwal  Pooja Hegde  Kokapet  Acharya  Koratala siva  Sonu sood  Tollywood  

Other Articles