A surprise coming from Ram Charan చెర్రీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్ డేట్..

A surprise coming from ram charan ram charan news

Ram Charan, Shankar, Dil Raju, Acharya, RRR, SS Rajamouli, NTR, Koratala Siva, Ram Charan news, Ram Charan new film, Ram Charan next movie, Ram Charan upcoming projects, Ram Charan upcoming movies, Ram Charan new movies, Ram Charan next film, Ram Charan with Shankar, Ram Charan with Dil Raju, Tollywood, movies, Entertainment

A surprise coming from Ram Charan: Mega Powerstar Ram Charan is completely focused on RRR, a periodic action drama that is set in the pre-independence. SS Rajamouli is the director and NTR, Ram Charan are the lead actors.

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త సినిమా

Posted: 02/11/2021 10:05 PM IST
A surprise coming from ram charan ram charan news

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతోపాటే చరణ్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రెండు ప్రాజెక్టులు చివరి దశకు చేరుకున్న తరుణంలో విశాంత్రికి తావులేకుండా చరణ్ తన తదుపరి ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఔనా.. ఏ దర్శకుడితో మూవీ తీయబోతున్నాడనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అద్భుత సాంకేతికతను సొంతం చేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ తో ఆయన తన తాజా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమా అప్‏డేట్ త్వరలోనే రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రామ్ చరణ్ సినిమా అప్‏డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం మెగా హీరో రామ్ చరణ్.. కొత్త సినిమాను కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నట్లుగా టాక్. శంకర్ చెప్పిన స్టోరీ.. చరణ ‏కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లుగా గత కొన్నిరోజులుగా టాలీవుడ ‏లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తీయనున్నట్లుగా మరికొందరి నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో చరణ్ తీయనున్నారనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles