Ravi Teja plans to reshoot Krack సంక్రాంతికి 'క్రాక్' ఎత్తిపోతానంటున్న మాస్ మహారాజ్..

Ravi teja and shruti haasan starrer kracks latest poster is all things love

Ravi Teja, Shruti Haasan, Krack, Gopichand Malineni, first look, COVID 19, Sankranti release, B Madhu, Thaman S, Tollywood, movies, Entertainment

The latest poster of Krack was unveiled by the Mass Maharaja Ravi Teja on his social media handle. The latest poster of the action thriller sees Ravi Teja in a casual look and the sultry siren Shruti Haasan in a pink coloured saree, and hair left open. The Ravi Teja starrer will be releasing on Sankranti 2021.

సంక్రాంతికి ‘క్రాక్’ ఎత్తిపోతానంటున్న మాస్ మహారాజ్..

Posted: 11/12/2020 03:08 PM IST
Ravi teja and shruti haasan starrer kracks latest poster is all things love

సంక్రాంతి పండుగ దక్షిణాది రాష్ట్రాలలో వెరీ స్పెషల్. తమిళనాడులో పొంగల్ ఇలా పేర్లు మారినా సంక్రాంతి అంటేనే పంట ఇంటికి చేరిన పండగ. మన సంస్కృతిలో భాగమైన పల్లెధనానికి, ప్రకృతికి, మనిషి జీవన విదానానికి ముడివేసిన పండుగ. ఇక తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఆడపడచులు రంగవళ్లులు, గోబ్బమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, సరదా సవాళ్లు ఇలా పండగ మూడు రోజులే అయినా వారం రోజుల వరకు తమను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదనే పందేరాయుళ్లు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఇక ఈ సంబరాల్లో భాగంగా సాయంకాలలు కుటుంబాలు సినిమా థియేటర్లకు వెళ్లడం.. సంక్రాంతికి కొత్త సినిమాలు రావడం కూడా పరిపాటిగా మారింది.

దీంతో సంక్రాంతి అంటేనే ఏడాది ప్రారంభంలోనే మంచి బూస్ట్ ఇచ్చే ఓపెనింగ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో మన పెద్ద హీరోలంతా తమ సినిమాలను అప్పుడు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇక అదే సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా హీరో రవితేజ కూడా దిగుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా రూపొందుతున్న 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. చిత్రం షూటింగుకు సంబంధించి ఒక పాట చిత్రీకరణ మినహా అంతా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్షీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles