Govt to govern OTT platforms, online news portals కేంద్రం పర్యవేక్షణలోకి ఓటిటి, అన్ లైన్ న్యూస్..

Digital news portals ott platforms like netflix now under govt regulation

netflix india,online streaming, Prakash Javadekar, President Ram Nath Kovind, amazon prime, I and B Ministry, Indian online news, online news comes under IB Ministry, Govt of India (Allocation of Business) Three Hundred and Fifty Seventh Amendment Rules, 2020, Supreme Court

The government has brought online mediums, including films and news content, under the ministry of information and broadcasting. The I&B ministry will also regulate online audio-visual programmes and current affairs content, according to the amendment order signed by President Ram Nath Kovind.

కేంద్రం పర్యవేక్షణలోకి ఓటిటి, అన్ లైన్ న్యూస్.. రాష్ట్రపతి అమోదం

Posted: 11/12/2020 02:35 PM IST
Digital news portals ott platforms like netflix now under govt regulation

టెలికమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో క్షణాలో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకునేలా సమాచార స్రవంతి మారింది. అంతేకాదు తమ అభిమాన చిత్రాలను చూడాలనుకునే వారు నేరుగా విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే వారింట్లో కూర్చోన్ని వాటిని వీక్షించే సౌలభ్యం కూడా ఓవర్ ది టాప్ (ఓటిటి) ఫ్లాట్ ఫామ్ లు మనకు కల్పించాయి, అయితే ఇన్నాళ్లుగా వీటిపై ప్రభుత్వ అజమాయిషీ లేక ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా అశ్లీలతను కూడా పెంచిపోషించారు. దీంతో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం పలు మార్పులతో కూడిన ప్రభుత్వ గెజిట్ ను తీసుకువచ్చింది.

ఇకపై అన్ని ఆన్ లైన్ మీడియా, సినిమాలు, న్యూస్ కంటెంట్ ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తమ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన చట్ట సవరణపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి ఎంటర్టైన్ మెంట్ మాధ్యమాలన్నీ కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ పరిధిలోకి వస్తాయి. సినిమాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నియంత్రిస్తుంది. మీడియాలో వచ్చే యాడ్స్ ను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సంబంధించి మాత్రం ఇంత వరకు ఎలాంటి చట్టం కానీ, దాన్ని నియంత్రించే వ్యవస్థ కానీ రాలేదు. తాజా నిర్ణయంతో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లనున్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మితిమీరిన అశ్లీలతకు ఇకపై అడ్డుకట్ట పడబోతోంది. కాగా, ప్రభుత్వం నుంచి ఈ మేరకు సంకేతాలు వెలువడుతున్న క్రమంలో గత ఏడాది జనవరిలోనే ప్రజాదరణ అధికంగా వున్న ఎనమిది ఓటిటి యాప్, వీడియో స్ట్రీమింగ్ సర్వీసు సంస్థలు ఒక స్వీయ నియంత్రణ కోడ్ ను తీసుకుని వచ్చాయి, ఈ కోడ్ మార్గదర్శక సూత్రాలను పోందుపర్చుకుని వాటిని అతిక్రమించకూడదని ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ కోడ్ ను ప్రభుత్వం గుర్తించలేదు. ఇదిలావుండగా ప్రింట్ మీడియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందే ఉండబోతోంది. అయితే ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కిందకు వస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles