Nithin to got out door location for shooting ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

Nithin to got out door location for his andhadhun remake

Nithin, Shriya, Andhadhun, Merlapaka Gandhi, Sahi Suresh, locations selection, andhadhun remake shooting, Goa, tamanna bhatia, Nabha Natesh, Movies, Entertainment, tollywood

Nithiin starrer upcoming film which is remake of Bollywood film Andhadhun remake, has become the talk of town as it is ready to shoot the movie on outdoor locations in Goa. The Art director Sahi suresh had selected the locations and shared the update through his social media account.

ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

Posted: 10/06/2020 11:14 PM IST
Nithin to got out door location for his andhadhun remake

అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో చిత్రయూనిట్ తమ చిత్రాలను పలు లొకేషన్లలో షూటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో హీరో నితిన్ నటిస్తున్న అంధాదున్ రిమేక్ చిత్రం షూటింగ్ మాత్రం క్రమంగా ఔట్ డోర్ లోకేషన్లలో చిత్రీకరించేందుకు రెడీ అయ్యిందని సమాచారం.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కూడా ఔట్ డోర్ లొకేషన్లకు వెళ్లి షూటింగ్ చేయడానికి కొందరు దర్శక నిర్మాతలు ప్లాన్ చేయగా, అదే బాటలో నితిన్ చిత్రం కూడా ఇతర రాష్ట్రంలోని పలు లోకేషన్స్ కు వెళ్లి అక్కడి చిత్ర షూటింగ్ ను ప్లాన్ చేసుకుంటొంది. ఔట్ డోర్ షూటింగ్ కు హీరో నితిన్ అనుమతినివ్వడంతో.. దర్శకుడు మేర్లపాక గాంధీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఇందులో భాగంగా దర్శకుడు గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్ ప్రస్తుతం గోవాలో లొకేషన్లను ఎంపిక చేస్తున్నారు.

అయితే చిత్ర కథ డిమాండ్ చేసిన మేరకు గోవాలోని పలు లొకేషన్లను సరిగ్గా సరిపోతాయని భావించిన ఆర్ట్ డైరెక్టర్ వాటిని దర్శకుడు మేర్లపాక గాంధీ దృష్టికి తీసుకురావడంతో పాటు హీరో నితిన్ తోనూ ఆ వివరాలను పంచుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ సాహి సురేశ్ అక్కడి తమ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రియ కీలక పాత్రను పోషించనుంది. గోవాతో పాటు కొంత షూటింగును ఇటలీలో కూడా చేయనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Shriya  Andhadhun  Merlapaka Gandhi  Sahi Suresh  Goa  tamanna bhatia  Nabha Natesh  tollywood  

Other Articles