Shruti Haasan Slam Telugu Media Houses తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

Shruti haasan clarification says pawan kalyans gabbar singh

Shruthi Haasan, Telugu Media, Quote, Interview, American Telivision, Treadstone, Telugu film, south Indian cinema, Tollywood, Movies, Entertainment

Shruti Haasan just took to her social media and cleared the air about her controversial interview where she compared North and South films, claims her quotes are misinterpreted and the publications running the articles aren't true.

తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

Posted: 10/06/2020 11:28 PM IST
Shruti haasan clarification says pawan kalyans gabbar singh

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను తెలుగు మీడియా తప్పుగా అర్థం చేసుకుని తన గురించి తప్పుడు కథనాలను ప్రచురించారని అన్నారు. దీంతో అమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులకు సినీపరిశ్రమలకు తనతరపున క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తాను ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో తాను పేర్కొన్న అంశాన్ని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా అన్వయించాయని ఆరోపించారు.

ఆ అంశంపై సదరు తెలుగు మీడియా సంస్థల నుంచి వచ్చిన కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని శ్రుతి హాసన్ ఉద్ఘాటించారు. రేసుగుర్రం, పవన్ కల్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నానని వివరించారు. అలాంటి తెలుగు సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని శ్రుతి వెల్లడించారు. ఉత్తరాది, దక్షిణాది చిత్రాల మధ్య తారతమ్యాలను, వత్యాసాలను ఎత్తిచూపే ప్రక్రియకు తాను పూర్తిగా వ్యతిరేకమని అన్నారు, ప్రస్తుతం హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ధ్రెడ్ స్టోన్ సిరీస్ లో మంచి పాత్రతో ఆకట్టుకుంటున్నముద్దుగుమ్మ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles