Nithin and Yeleti's film titled Check హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

Yeleti cooking chess backdrop for nithin check

Nithiin, Check, Chandra Sekhar Yeleti, Rakul Preet Singh, Priya Prakash Varrier, Nithiin Check, Nithiin Check news, Nithiin Check release date, Nithiin Check poster, Nithiin Check pre-look, Nithiin Check budget, Nithiin Check release news, Tollywood, movies, Entertainment

Young and talented actor Nithiin turned a signing spree and is busy with a bunch of films. The Bheeshma actor also commenced the shoot of an action entertainer in the direction of critically acclaimed director Chandra Sekhar Yeleti. The film is titled Check and the makers made an official announcement about the same today.

హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

Posted: 10/02/2020 01:25 AM IST
Yeleti cooking chess backdrop for nithin check

భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టిస్తున్న చిత్రానికి `చెక్‌` అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇవాళ ఖ‌రారు చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. గురువారం  ఈ చిత్ర టైటిల్‌తో పాటు ప్రీలుక్ పోస్ట‌ర్‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేశారు.

చ‌ద‌రంగం నేప‌థ్యంలో సాగే ఉరిశిక్ష‌ప‌డిన ఓ ఖైదీ క‌థ‌గా ఈ చిత్రాన్ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తున్నారు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీగా హీరో నితిన్ ఇందులో క‌నిపించ‌బోతున్నాడు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. నితిన్ న‌ట‌న హైలైట్‌గా స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా ఈ మూవీ సాగ‌నుంద‌ని తెలిసింది. ఈ నెల 12 నుంచి చివ‌రి షెడ్యూల్‌ని ప్రారంభించి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పూర్తి చేయ‌నున్నారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కిది తెలుగులో తొలి చిత్రం. పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీశ‌ర్మ‌, త్రిపుర‌నేని సాయిచంద్‌, సంప‌త్‌రాజ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రోహిత్ పాథ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithiin  Check  Chandra Sekhar Yeleti  Rakul Preet Singh  Priya Prakash Varrier  Tollywood  

Other Articles