Allu Family Venturing Into Studio Business 'అల్లు స్టూడియోస్'కు అంకురార్పణ

Allu family venturing into film studio business allu studios news

Allu family, Allu Studios, Allu Ramalingaiah, Allu Ramalingaiah news, Allu Ramalingaiah achievements, Allu Ramalingaiah films, Allu Studios news, Allu Studios updates, Allu Studios latest, Allu Studios inauguration, tollywood, movies, Entertainment

Marking the 99th birth anniversary of Legendary actor, comedian and producer Allu Ramalingaiah, the entire family came forward to announce 'Allu Studios' and the groundbreaking ceremony took place today.

రామలింగయ్య జయంతి రోజున ‘అల్లు స్టూడియోస్’కు అంకురార్పణ

Posted: 10/02/2020 01:17 AM IST
Allu family venturing into film studio business allu studios news

తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ హాస్యనటుల్లో అల్లు రామలింగయ్యకు అగ్రస్థానం వేయక తప్పదు. హాస్యనటులు అంటే ఈ తరం మాదిరిగా డబుల్ మీనింగ్ డైలాగులు, మాటల్లో ఒకటి.. చేతల్లో ఒకటి చేస్తూ నవ్వించడం కాదు. కేవలం హావభావాలతో పాటు సినిమాలు మనోరంజకం చేస్తాయన్న రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనూ అప్పట్లో కనిపించి.. కనిపించనట్టుగా వుండే హావభావాలను పండించి.. ప్రేక్షకులను రంజింపచేయడం నిజంగా కత్తి మీద సామే. అలాంటి హాస్యనటుల్లోనూ పోటీపడి ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు అల్లు రామలింగయ్య. ఇవాళ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మనవళ్లు ఆయన పేరున అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కేవలం రెండంటే రెండు రూపాయలతో గోదావరి జిల్లాల నుంచి మద్రాసుకు వెళ్లి అక్కడే నిర్మితం అవుతున్న తెలుగు చిత్రాలలో పాత్రలు వేస్తూ.. నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మారి.. అల్లురామలింగయ్య లేకుండా సినిమాలు తీయలేమన్న స్థాయికి ఎదిగారు. అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి. అల్లు నీడలో ఎదిగిన మెగా.. నిజంగా మెగా వటవృక్షంగా మారింది. ఇక అల్లు తనయుడు అల్లు అరవింద్ కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన సేవలోనే నిమగ్నమయ్యాడు, గీతా అర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనిర్మాతల్లో ఒకరిగా కోనసాగుతున్నారు.

ఓవైపు విజయవంతమైన చిత్రాలను రూపోందించే నిర్మాతగా కొనసాగుతన్న ఆయన.. తన సినీవ్యాపార వాణిజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తున్నారు. సినిమా వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నా.. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫాంపైకి దృష్టి మరల్చాడు. ఓటిటీలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఆహా యాప్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు, ఓటీటీ ఆహా యాప్ ద్వారా లాక్ డౌన్ తో ఇళ్లకు పరిమితమైన తెలుగు ప్రేక్షకులను మంచి రక్తికట్టించే సీరిస్ లతో పాటు సరికొత్త సినిమాలతో ప్రతీ టీవీలోకి ప్రవేశించాడు. సినీకళామతల్లికి ఎంత సేవ చేస్తే తనకు అంత మేలు జరుగుతుందని బావించే ఈ అగ్రనిర్మాత.. తాజాగా స్టూడియో రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

తన తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలోని కోకాపేట్ లో స్టూడియో నిర్మాణం చేపడుతున్నామంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ మేరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్ తో పాటు ముగ్గురు కుమారులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. టీవీ కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగులకి అనుగుణంగా స్టూడియో నిర్మాణం జరగనుందట. మొత్తానికి ఇప్పటికే ఫిల్మ్ హబ్ గా పేరున్న హైదరాబాద్ కి అల్లు స్టూడియో ద్వారా మరింత ప్రత్యేకత రానుంది. ఈ సందర్భంగా అన్ లైన్ ఫార్మసీ మెట్రోమెడీ సీఈవో దిలిప్ బైరా కూడా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీలను కలసి వారికి హార్థిక శుభాకాంక్షలను తెలిపారు.

 
 
 
View this post on Instagram

ALLU Studios

A post shared by Allu Arjun (@alluarjunonline) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles