Two arrested in death of Telugu TV actor Sravani case శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ2గా ఆర్ఎక్స్ 100 నిర్మాత

Hyderabad police names rx 100 producer ashok reddy

telugu tv actress suicide case, tv actress sravani kondapalli suicide case, Devaraj Reddy, Sai Kumar Reddy, RX 100 producer, Ashok Reddy Gummakonda, telugu tv actress, suicide case, sravani kondapalli, Sravani, Osmania Hospital, mounaraagam, Manasu Mamatha, Devaraju Reddy, Blackmail, SR nagar police, Hyderabab, crime

Hyderabad Police have their prime accused for the suicide case of TV actress Sravani Kondapalli. The police announced the names of the three accused in the case, which include TikToker Devaraj Reddy, Sai Kumar Reddy and RX 100 producer Ashok Reddy Gummakonda.

టీవి నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ2గా ఆర్ఎక్స్ 100 నిర్మాత

Posted: 09/15/2020 03:12 AM IST
Hyderabad police names rx 100 producer ashok reddy

‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా నిర్మాతగా మారిన అశోక్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు, ఆయనతో పాటు నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కోంటున్న సాయి కృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు వీరు ముగ్గరు తమ తమ స్థాయిలో అమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారని తేల్చిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కాగా, సాయికృష్ణారెడ్డీ, దేవరాజ్ రెడ్డీలను ఇవాళ రిమాండ్ కు తరలించిన పోలీసులు అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

టీవీలు, సినిమాల్లో నటించేడంపై ఆసక్తితో కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన ఇరవై ఆరేళ్ల శ్రావణి 2012లె హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఓ స్నేహితురాలు ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. వచ్చీరాగానే టీవీ ఆర్టిస్టుగా అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 2015లో శ్రావణికి సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు. 2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డి నిర్మించిన 'ప్రేమతో కార్తీక్' అనే చిత్రంలో శ్రావణి చిన్న పాత్ర పోషించింది. అప్పటి నుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది.

2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డి పరిచయం అయ్యాడు. టిక్ టాక్ వీడియోలతో వీరికి పరిచయం ఏర్పడింది. దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్ గా ఉండడం సాయికృష్ణకు నచ్చలేదు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో అప్పటినుంచి శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించడం మొదలుపెట్టారు. దేవరాజ్ తో మాట్లాడుతుందని శ్రావణిపై సాయికృష్ణ దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులే కాక, సాయి, అశోక్ రెడ్డి కూడా హెచ్చరించారు. అయితే దేవరాజ్‌ కూడా పెళ్లి పేరుతో శ్రావణిని మోసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు దేవతో శ్రావణి చాలా సేపు మాట్లాడిందని తేల్చారు.

అయితే ఆ సంభాషణలో ఎక్కడా అతడికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడకపోయినా.. పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పినందున అతడి పాత్ర కూడా ఈ కేసులో ఉందని భావించి పోలీసులు దేవరాజ్ ను ఏ3గా పేర్కోన్నారు, సాయి, అశోక్ రెడ్డి తనపై భౌతికదాడులు పాల్పడటం.. తల్లిదండ్రుల ప్రవర్తన వెరసి తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణిని ఆత్మహత్య ప్రేరేపించాయని పోలీసులు బావించారు. దీంతో ఈ కేసులో సాయికృష్ణారెడ్డిని ఏ1, అశోక్ రెడ్డిని ఏ2గా పేర్కొన్నారు. వీరు ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసినవాళ్లే. ఇలాంటి వాళ్ల పట్ల మిగతా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles