Madras HC judge seeks contempt proceedings against Suriya నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం: హీరో సూర్య

Judge seeks contempt proceedings against actor suriya over neet statement

Contempt of court, Madras High Court, NEET, neet 2020, Suriya, Tamil actor, students suicide, Judge Balasubramaniyam, Chennai, Tamil Nadu, kollywood

Tamil actor Suriya's recent tweet on conducting the NEET amid the COVID-19 pandemic has landed him into a legal tussle. Justice SM Subramaniam of the Madras High Court has urged Chief Justice Amreshwar Pratap Sahi to initiate criminal contempt proceedings against the actor.

నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం: హీరో సూర్య

Posted: 09/15/2020 02:56 AM IST
Judge seeks contempt proceedings against actor suriya over neet statement

వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ కు భయపడి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు అందోళనలతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది, ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటనలపై రాష్ట్రంలోని రాజకీయ నేతల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా స్పందించారు, వారి బాటలోనే సినీహీరోలు కూడా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యల ఘటనతో తన గుండె పగిలిందని ఆయన ట్వీట్ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబసభ్యులు పడుతున్న బాధను ఊహిస్తేనే భయంగా వుందని పేర్కోన్నారు, విద్యావ్యవస్థ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసిన హీరో సూర్య.. ప్రజలంతా నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఉత్పన్నమైందని అన్నారు. నీట్ భయంతో ఒక్క రోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, ఇలాంటి వార్తలు తనతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా ఎంతగానో కలిచివేశాయని తెలిపారు. ఏదైనా పరీక్షలకు ముందు విద్యార్థులకు తమ సహచరులు శుభాకాంక్షలు చెబుతారని, కానీ ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియలో విద్యార్థులకు ఓదార్పు మాటలు చెప్పి పరీక్షలు రాయించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోందని ఇది చాలా దారుణమని ఆయన అన్నారు.

విద్యార్థులకు పరీక్ష ముందు ధైర్యం నూరిపోయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. నీట్ పరీక్షలతో పేద విద్యార్థులను డాక్టర్లు కావాలన్న కోరికను చంపేసిందని సూర్య మండిపడ్డారు. దీంతో ఆయనకు మద్దతుగా నెట్ జనులు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలను తీవ్రంగా ఖండిస్తూ నటుడు కమల్ హాసన్, మాధవన్ లు కూడా పోస్టులు పెట్టారు. ఇక హీరో సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం.. ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles