Senior Actor bollywood 'surma bhupali' is no more నటుడు జగదీప్ ను స్మరించుకుంటూ మీజాన్ జాఫ్రే పోస్టు..

Meezaan jaffrey shared special picture after jagdeeps departure

meejan jaffrey, meejan jaffrey latest news, meejan jaffrey social media post, jaffrey share gradfather jagdeep photo, meejan jaffrey, javed jaffrey, jagdeep, surma bhupali, instagram, social media post, jaffrey share gradfather jagdeep photo, bollywood

Bollywood actor Jagdeep has said goodbye to the world at the age of 81 on Wednesday night. In 2020, the Bollywood industry has lost many legendary personalities. Actors Irrfan Khan, Rishi Kapoor, Wajid Khan, Sushant Singh Rajput and Saroj Khan and now Jagdeep bid goodbye to the industry. Many other stars including Amitabh Bachchan and Dharmendra have also expressed grief over Jagdeep's departure.

నటుడు జగదీప్ ను స్మరించుకుంటూ మీజాన్ జాఫ్రే పోస్టు..

Posted: 07/11/2020 12:11 AM IST
Meezaan jaffrey shared special picture after jagdeeps departure

యావత్ ప్రపంచానికి ఈ ఏడాది అసలు కలసిరాలేదు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ.. లక్షలాధి మంది ఈ మహమ్మారి బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది పేరు వినబడితేనే బాలీవుడ్ పరిశ్రమ భగ్గుమంటోంది. ఈ పరిశ్రమకు చెందిన అనేక మంది దిగ్గజాలు ఈ ఏడాదిలోనే కరోనా వ్యాపించకుండానే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం అందుకు ముఖ్య కారణం. బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజపుత్, వాజిద్ ఖాన్, సరోజ్ ఖాన్ ఇలా పలువురు దిగ్గజాలు ఈ ఏడాదిలో అసువులు బాయడంతో బాలీవుడ్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సమయంలోనే బాలీవుడ్ కమేడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే బాలీవుడ్ సూర్మా భూపాలీగా పేరోందిన జగదీప్ కూడా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన వయస్సు 81 సంవత్సరాలు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి మృతి చెందారు. ‘షోలే’ చిత్రంలోని సూర్మా భూపాలీ’ పాత్రతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న జగదీప్‌ సుమారు 400 చిత్రాల్లో నటించారు. షమ్మీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రహ్మచారి’ చిత్రంలోని హాస్య పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘పురానా మందిర్‌’, ‘త్రీడీ సామ్రి’ లాంటి హారర్‌ చిత్రాల్లోనూ నటించారు జగదీప్‌. ‘అందాజ్‌ అప్నా అప్నా’, ‘చైనా గేట్‌’, ‘ముంబయి టు గోవా’ తదితర చిత్రాల్లో నటించారాయన. అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గలీ గలీ ఛోర్‌ హై’ చిత్రంలో చివరిగా నటించారు జగదీప్‌.

ఆయన అంత్యక్రియలు గురువారం షియా మత సంప్రదాయం ప్రకారం ముగిశాయి. జగదీప్‌ మృతిపట్ల బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, అజయ్‌దేవగణ్‌, జానీలివర్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణంచుకోలేకపోతున్న ఆయన మనువడు.. మీజాన్ జాఫ్రే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ పోస్టు పెట్టాడు. అది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తన తాతను తలచుకుంటూ,. చిన్న తనంలో ఆయన తన తాతకు ముద్దు పెడుతున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు మీజాన్ జాఫ్రే. తన తాతకు ఎంతో ఆఫ్యాయంగా ముద్దు పెడుతుండగా, ఆయన కూడా తన మనవడి ప్రేమ మొత్తాన్ని ముద్దు ద్వారానే ఆస్వాదించేలా పోజు పెట్టారు.

 
 
 
View this post on Instagram

 

A post shared by Meezaan (@meezaanj) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles