రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూపులకు చెక్ పెడుతూ.. ఇవాళ రిలీజ్ చేసింది. సాహో తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే రొమాంటిక్‌గా నిలబడిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమాకి ‘రాధే శ్యామ్’ టైటిల్ పెట్టినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ ‘ఫ్యూచర్ టెల్లర్’గా.. పూజా యువరాణిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్రియదర్శి, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రబృందం షూటింగ్ కోసం జార్జియా వెళ్లింది. అక్కడి షూటింగ్ పూర్తి చేసుకొని భారత్‌కు రాగానే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసింది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more