cinema halls is our priority: Kona Venkat అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ పై తేల్చిచెప్పిన కోన వెంకట్.!

Cinema is meant for cinema halls and that is our priority kona venkat

anushka shetty, nishabdam, kona venkat, Hemanth madhukar, OTT platform, Movie making, producer, Anjali, Subba Raju, Avasarala Srinivas, tollywood, movies, entertainment

Speculations were rife about the team of Hemant Madhukar’s pan-Indian film Nishabdham, which was also set to hit screens in English as Silence, holding talks with an OTT platform to see if the film can opt for a digital release.

అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ పై తేల్చిచెప్పిన కోన వెంకట్.!

Posted: 05/18/2020 04:34 PM IST
Cinema is meant for cinema halls and that is our priority kona venkat

అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం విడుదలపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో, ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాంట్ ఫాంపై విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారనీ, దానికి అనుష్క అభ్యంతరం చెబుతోందని పలు వార్తలు షికారు చేశాయి. ఇక ఇటీవలే ఓ ఓటీటీ సంస్థ ఈ చిత్ర నిర్మాతలకు భారీ ఆఫర్ చేసిందని, దాంతో నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారనీ, అయితే లాక్ డౌన్ ముగిశాక థియేటర్లలో కూడా విడుదల చేసుకునే షరతుపై అయితే ఓకే అన్నారనీ కూడా వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తాజాగా దీనిపై స్పందించారు. 'సినిమా రంగానికి మేము ఓ అనురక్తితో వచ్చాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మేము పడ్డా శ్రమకు థియేటర్లలో ప్రేక్షకులు చూపించే ప్రతిస్పందన మాకు ప్రేరణను, ప్రాణవాయువును అందిస్తుంది. మరేదీ అలాంటి అనుభూతిని ఇవ్వలేదు. సినిమా అన్నది సినిమా హాల్స్ కోసమే.. మా ప్రాధాన్యత కూడా దానికే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇక ఈ సినిమా కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల అవుతుందనీ, ఓటీటీ వేదికగా విడుదల కాదనీ తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles