Mahesh Babu And Son Gautham Play "Blink You Lose" మహేష్ తో గేమ్.. నవ్వపుకోలేకపోయిన గౌతమ్..

Mahesh babu and son gautham play blink you lose in namrata s throwback video

Namrata Shirodkar, coronavirus lockdown, Mahesh Babu, Gautham, Sitara, "Blink You Lose", throwback video, Tollywood, movies, Entertainment

Namrata shared another throwback video featuring Mahesh Babu and Gautham and it is just too adorable. In the video, Mahesh and Gautham were seen playing "blink and you lose."

మహేష్ తో గేమ్.. నవ్వపుకోలేకపోయిన గౌతమ్..

Posted: 05/18/2020 03:42 PM IST
Mahesh babu and son gautham play blink you lose in namrata s throwback video

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో తన కుటుంబంతో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిత్యం బిజీ బిజీగా వుండే మహేష్ బాబు.. షూటింగ్ లతో ఔట్ స్టేషన్ లలో లేదా వేళ కానీ వేళల్లో ఇంటికి చేరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని దేశంలోని నిత్యం బిజీగా వుండే సెలబ్రిటీలకు తమ కుటుంబంతో సమయాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా వెచ్చించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో తన కూతురు సితారాలో కలసి టైమ్ స్పెండ్ చేసిన వీడియోలను ఇప్పటికే షేర్ చేసిన నటుడు తన తనయుడితో కలసి ఆడిన గేమ్ గురించి కూడా చూద్దామా..

మహేశ్ బాబు తన కుమారుడితో ఆడుకుంటూ కనపడుతున్నాడు. మహేష్ బాబు నీళ్లు తాగుతుండగా.. ఆయన తనయుడు గౌతమ్ అలా కనురెప్పలు మూయకుండా చూస్తుండగా, మహేష్ ను చూసి నవ్వుతాడు. అంతే మహేష్ కూడా నవ్వేశాడు. దీంతో ఇటు తిరిగిన గౌతమ్ మరోమారు అదే ప్రయత్నం చేశాడు. ఈ సారి నాలుకను చాపి అలా పోజ్ పెట్టే ప్రయత్నం చేయడంతో మరోమారు మహేష్ నవ్వుతాడు. దీంతో మీరు నవ్విస్తున్నారు అంటూ గౌతమ్ అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్లడం కనిపించింది. ఇంతకీ వీరలా ఎందుకు చేశారు. అన్న ప్రశ్న మీలోనూ ఉదయిస్తుంది కదూ..

మహేశ్‌ బాబు, కుమారుడు గౌతమ్ కు సంబంధించిన మరో వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు వారు ఇలా ఎందుకు చేశారో కూడా పోస్టు చివరన వివరించింది. 'ఈ గేమ్‌ గురించి తెలియని వారి కోసం ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇది బ్లింక్ అండ్‌ యు లూజ్ కాంపిటేషన్. అయితే, జీజీ (ఘట్టమనేని గౌతం) ఈ గేమ్ ఆడేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. కళ్ల రెప్పలు కొట్టకుండా ఉండలేకపోయాడు' అని తెలిపింది. ఈ గేమ్‌ ఆడుతున్నప్పుడు కనురెప్పలు మూయకుండా ఉండాలి. ఎవరు ముందుగా కనురెప్పలు కొడితే వారు ఓడినట్లు. మహేశ్‌ బాబు, కుమారుడు గౌతమ్ కు సంబంధించిన మరో వీడియోను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles