Did Aamir Khan distribute money in wheat flour packets? అమీర్ ఔదార్యం: పేదలకు రూ.15వేల గుప్తదానం..

Aamir khan sends hidden money in wheat flour packets to the needy

#AamirKhan, KiranRao, LaalSinghChaddha, Artist, Movie, Film, IndiaShowbiz, aamir khan,Aamir Khan Coronavirus aid,Aamir Khan Coronavirus message,coronavirus,covid-19,Laal Singh Chaddha,tik tok viral video,aamir khan tik tok video,bollywood news,trending news,Lockdown,TikTok, Bollywood, Online, Lockdown, Tollywood, movies, Entertainment

Actor Aamir Khan is been in the news by doing something totally unexpected. Aamir is believed to have applied his ‘perfectionist’ mind in doing the needful. As per the report, the actor sent out a truck filled with wheat flour packets weighing 1 kg. An amount of Rs 15,000 was reportedly hidden in these packets.

అమీర్ ఔదార్యం: పేదలకు గుప్తదానం.. గోదమపిండిలో రూ.15వేలు..

Posted: 04/28/2020 07:46 PM IST
Aamir khan sends hidden money in wheat flour packets to the needy

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలుచేస్తున్న వేళ, గత నెల రెండో వారం నుంచి సినిమా హాల్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ప్రజలంతా ఒకేచోట గుమికూడే ప్రాంతాలన్నీ మూసివేయబడగా, ఇప్పుడప్పుడే థియేటర్లు తెరచుకునే అవకాశం లేదు. ఇక సినిమా షూటింగ్ లకు ఊసు కూడా వినిబడకుందా పోయింది. దీంతో ఎంతో మంది సినీప్రముఖులు ఈ రంగంలోని రోజువారి వేతన జీవులను అదుకునేందుకు ముందుకువచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను పంఫిణీ చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు సినీప్రముఖులు తమ దానాలను గుప్తంగా చేసేస్తున్నారు. తాము ఇచ్చేది ఇస్తాం.. తాము చేసే దానాలకు పేరు మాత్రం తమకు వద్దని కూడా ఖరాఖండీగా చెబుతున్నారు. ఇలాంటి గుప్తదానాలు చేయడంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అగ్రస్థానంలో వున్నాడు. లాక్ డౌన్ పొడిగింపుతో దేశంలో నిరు పేదలు, వలస కూలీల ఆకలి కేకలను అర్థం చేసుకున్న ఆయన వారికా సాయం చేయాలని తలిచాడు. కేవలం కిలో గోదుమ పిండి ప్యాకెట్లను పేదలు వున్న బస్తీలలో పంచాడు. కిలో గోధుమ పిండి ఎందుకులే అంటూ కొందరు తీసుకోకపోగా, కొందరు అదీ కూడా లేదని తీసుకున్నారు. దీంతో అమీర్ ఖాన్ పై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి.

అమీర్ ఖాన్‌ పేదల‌కు చేసిన వినూత్న సాయం టిక్‌టాక్‌ వీడియోతో సోష‌ల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఏంటీ కిలో గోధుమ పిండి పంపిణీ చేస్తే అంత వైరల్ ఎలా.? అంటూ ఆశ్చర్యపోతున్నారా.? అవును ఎందుకంటే.. ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడ‌గా ఆశ్చర్యపోయారు. అందులో రూ.15 వేలు క‌నిపించాయ‌ట‌. దీంతో ఆశ్చర్యంతో కూడి ఆనందం వారి సొంతమైంది. కాగా, ఈ ట్రక్కును పంపించింది ఎవరు? వారికి సాయం చేసింది ఎవరు? అనే వివరాలు ఏవీ తెలియవు. కొంతమంది మాత్రం ఇది కచ్చితంగా స్టార్ హీరో అమీర్ ఖాన్ పనే అని చెప్పుకుంటున్నారు. దీనిపై అమీర్ ఖాన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  kiran rao  laal singh chaddha  bollywood  lockdown  Rs 15000  poor  shops open  tollywood  

Other Articles