అక్కినేని కోడలు సమంత కోసం ఆమె భర్త నాగచైతన్య ప్రత్యేకంగా కేక్ తయారు చేశారు. మంగళవారం సామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య సోమవారం రాత్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో స్వయంగా కేక్ తయారు చేసి, ఆమెతో కట్ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులోని ఓ ఫొటోలో సామ్ కేక్ ముందు కూర్చుని దేవుడిని పార్థిస్తూ కనిపించారు. చైతన్య కేక్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
లాక్డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన చై-సామ్ ఇష్టమైన పనులు చేస్తూ.. సినిమాలు చూస్తున్నారు. పెంపుడు శునకం హష్‌తో సమయం గడుపుతున్నారు. సామ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సమంత. నీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని వెంకటేష్ పోస్ట్ చేశారు. ‘నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలానే షైన్ అవుతూ ఉండు’ అని రకుల్ పేర్కొన్నారు. రానా, హన్సిక, తమన్నా, రత్నవేలు, నీరజ కోన, నందిని రెడ్డి, నాగశౌర్య, వెన్నెల కిశోర్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా విష్ చేశారు. అభిమానులు సామ్‌ను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more