Sarileru Neekevvaru gets cleared with UA కత్తెర పనులు పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరూ’

Mahesh babu s sarileru neekevvaru gets cleared with ua

Anil Sunkara, dil raju, mahesh babu, Tamannaah, rashmika mandanna, Sarileru Neekevvaru, Suryudivo Chandrudivo song, Vijayashanti, Prakash Raj, Anil ravipudi, DSP, tollywood, movies, entertainment

Superstar Mahesh Babu starrer Sarileru Neekevvaru has completed its censor formalities. The board members had passed the movie with a UA certificate.

కత్తెర పనులు పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరూ’

Posted: 01/03/2020 05:45 PM IST
Mahesh babu s sarileru neekevvaru gets cleared with ua

మహర్షి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఉత్సాహంలో వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. కథానాయకుడిగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ చిత్రం కూడా ఇవాళ సెన్సార్ పనులకు ముగింపు చెప్పింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో అంత వేగంగా పూర్తైన సినిమా ఇదే.

సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉండటంతో U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా అంతా ఎంటర్ టైనింగ్ గా ఉందని.. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం అని తెలుస్తుంది. టాక్ కూడా పాజిటివ్‌గానే వస్తుంది. అయితే రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒక్కటే సరిలేరు నీకెవ్వరు సినిమాకు మైనస్ అయ్యేలా ఉందని ప్రచారం జరుగుతుంది.

డిసెంబర్ 18తోనే ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ్ కొట్టేసిన అనిల్.. విడుదలకు రెండు వారాల ముందే ఫస్ట్ కాపీ కూడా సిద్ధం చేసాడు. 2 గంటల 40 నిమిషాల నిడివితో వస్తుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 39 నిమషాల పాటు ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rashmika mandanna  Tamannaah  Sarileru Neekevvaru  Vijayashanti  Anil ravipudi  DSP  tollywood  

Other Articles