Rajasekhar apologizes to chiranjeevi on twitter చిరంజీవి, మోహన్ బాబులకు క్షమాపణలు: రాజశేఖర్

Hero rajasekhar apologizes to chiranjeevi and mohan babu on twitter

Chiranjeevi, Rajasekhar, MAA Event, Chiranjeevi news, Chiranjeevi work, Chiranjeevi Vs Rajasekhar, Chiranjeevi at MAA event, Chiranjeevi against Rajasekhar, diary launch, park hayath, Mohan Babu, Tollywood, Entertainment, movies

Rajasekhar tendered his apology to Chiranjeevi and Mohan Babu for his rude behaviour. "Whatever happened today is only between Naresh, Maa and me. Things aren't right here and I cannot stand aside quietly and watch. There is no misunderstanding or fight between Chiranjeevi Garu, Mohan Babu Garu and Me. I apologise for any inconveniance caused to our guests!," Rajasekhar tweeted.

చిరంజీవి, మోహన్ బాబులకు క్షమాపణలు: రాజశేఖర్

Posted: 01/02/2020 10:23 PM IST
Hero rajasekhar apologizes to chiranjeevi and mohan babu on twitter

చిరంజీవికి, తనకూ మధ్య ఎలాంటి గొడవలు, అపోహలు లేవని సినీ నటుడు రాజశేఖర్‌ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అందరి కాళ్లకూ మొక్కుతూ, రాజశేఖర్‌ ఆవేశంతో ప్రసంగించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు చిరంజీవితో సహా అందరూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, గురువారం ఉదయం జరిగిన పరిణామాలపై రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘ఈరోజు ఏం జరిగినా అది నాకూ, నరేశ్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే జరిగింది. ఏ ఒక్క పనీ సరిగ్గా జరగడం లేదు. అందుకే నేను మాట్లాడకుండా ఉండలేకపోయా. నాకూ చిరంజీవిగారికి, మోహన్‌బాబుగారికి మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవు. నా వల్ల ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశా. చిత్ర పరిశ్రమకు నా వల్ల ఏం సాయం కావాలన్నా చేస్తా. ఈరోజు జరిగిన దానిని దయ చేసి పెద్దదిగా చూపించకండి. ముఖ్యంగా చిరంజీవిగారికీ, మోహన్‌బాబుగారికీ నాకూ మధ్య జరిగిన గొడవగా దీన్ని సృష్టించవద్దు. వారిద్దరి పైనా నాకు అమిత గౌరవం ఉంది. ‘మా’కు వారి సేవలు అవసరం. దయ చేసి దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు’’ -ట్విటర్‌లో  రాజశేఖర్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Rajasekhar  MAA Event  diary launch  park hayath  Mohan Babu  Tollywood  

Other Articles