ismatt shanker 2nd day box office collections ఇస్మార్ట్ శంకర్ రెండో రోజు బాక్సాఫీసు కలెక్షన్లు

Ismatt shanker 2nd day box office collections

Ismart Shankar movie 2nd day Worldwide Collections.. Ram,puri jagannadh movie sets fire at Tollywood Box office,ismart shankar second day collections,ram pothineni,ram pothineni twitter,ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar 2nd day collections, ismart shankar movie,ismart shankar collections, ismart shankar movie Second day collections, entertainment, movies, tollywood

Young Hero Ram potheneni film in puri jagannath direction ismart shanker worldwide box office collections details

ఇస్మార్ట్ శంకర్ రెండో రోజు బాక్సాఫీసు కలెక్షన్లు

Posted: 07/20/2019 06:14 PM IST
Ismatt shanker 2nd day box office collections

టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్.. అసలు హీరోగా సరైన సక్సెస్‌లేని రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమ చేసాడు. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. గత కొన్నెేళ్లుగా మార్కెట్‌లో మాస్ సినిమా కోసం వెయిట్  చేస్తోన్న ప్రేక్షకులకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో మంచి సినిమా దొరకడంతో కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూసి ఇప్పుడు అంతా నోరెళ్ల‌బెడుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్లో కూడా ఎప్పుడూ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. ఫ‌స్ట్ డే ఇటు తెలంగాణ‌.. అటు ఆంధ్రాలో చిన్న‌సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు ఇస్మార్ట్ శంక‌ర్. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్‌తో కలుపుకొని రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. తాజాగా రెండో రోజు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గలేదు. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో కలిపి 4.29 కోట్ల షేర్ వసూళు చేసింది.

మొత్తంగా రెండు రోజులకు గాను రూ. 11.75 కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమా సత్తా ఏమిటో చూపించింది. మొత్తంగా  రెండు రోజులకు గాను ఓవరాల్‌గా రూ. 25 గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న  ఈ సినిమా ఈ వీకెండ్ నాటికీ లాభాల్లో వచ్చే అవకాశం ఉంది.పూరీ మార్క్ మాస్ డైలాగుల‌తో ఈ సినిమా నిండిపోయింది.

దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. మొత్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రో సినిమా కూడా ఏదీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం ఇస్మార్ట్ శంక‌ర్‌కు క‌లిసొచ్చే అంశం. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర పూరీ జగన్నాథ్, రామ్‌ల దండయాత్ర ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ismart Shankar  2nd day Collections. Ram potheneni  puri jagannadh  tollywood  

Other Articles