Naga Chaitanya Hikes Remuneration! అబ్బో నాగచైతన్య కూడా చాలా కాస్ట్లీ గురూ..!

After samantha now naga chaitanya hikes remuneration

Dil Raju, Maha Samudram, Majili, Naga Chaitanya, Samantha, Praveen Sattaru, entertainment, movies, tollywood

Naga Chaitanya’s career is finally on right track. He has solidified his market with the success of “Majili”, he has decided to make a hay while sun shines. He is demanding more remuneration.

అబ్బో నాగచైతన్య కూడా చాలా కాస్ట్లీ గురూ..!

Posted: 04/26/2019 08:59 PM IST
After samantha now naga chaitanya hikes remuneration

దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని మాత్రం మన సినిమా ఇండస్ట్రీ వాళ్లు చాలా బాగా వంటపట్టించుకున్నారన్న విషయం తెలిసిందే. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అంతేగా మారి సక్సెస్ రూటు తప్పితే.. అప్పటి వరకు క్యూ కట్టే డైరక్టర్లు, ప్రోడ్యూసర్లు కూడా చూసిచూడనట్టు వ్యవహరిస్తారన్నది మనకు ఇప్పటికే ఎందరో మహా దిగ్గజాల అనుభవాలు తెలుపుతున్నాయి.

ఈ క్రమంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి సమంత తన రెన్యూమరేషన్ ను పెంచిన అదే వారంలో అమె భర్త హీరో నాగచైతన్య కూడా అదే బాటలో పయనించారు. ఎన్నాళ్లుగానో మంచి హిట్ కోసం వేచిచూస్తున్న ఈ హీరో ఎట్టకేలకు తాను తన భార్యతో పెళ్లైన తరువాత నటించిన తొలి చిత్రం మజిలి హిట్ కాగానే తాను కూడా యాభై కోట్ల మార్క్ దాటే చిత్రాలలో నటించగలనని సత్తాను చాటుకున్నాడు. దీంతో చైతూ కూడా పెంచేశాడనేది ఫిల్మ్ నగర్ టాక్.

కొంతకాలంగా చైతూకి హిట్ లేదు. విజయాల కోసం ఆయన ఎంతో సహనంతో ఎదురుచూస్తూ, ఇటీవల 'మజిలీ' చేశాడు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ, చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆయన ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికానికి మరో కోటి చేర్చి చెబుతున్నట్టుగా సమాచారం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి పారితోషికం పెంచేశారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'వెంకీమామ' చేస్తోన్న చైతూ, ఆ తరువాత సినిమాను అజయ్ భూపతితో చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Maha Samudram  Majili  Naga Chaitanya  Samantha  Praveen Sattaru  tollywood  

Other Articles