Kanchana 3 enters the Rs 100 crore club 100 కోట్ల కబ్ల్ లోకి రాఘవ లారెన్స్ కాంచన-3

Raghava lawrence s kanchana 3 enters the rs 100 crore club

Kanchana 3 box office collection, kanchana 3 box office, muni 4 box office, raghava lawrence, entertainment, movies, tollywood

Kanchana 3 box office collection: Establishing a big milestone, Raghava Lawrence starrer Kanchana 3 has entered Rs 100 cr club within its 1st week. The blockbuster is minting money at the box office.

100 కోట్ల కబ్ల్ లోకి రాఘవ లారెన్స్ కాంచన-3

Posted: 04/26/2019 08:34 PM IST
Raghava lawrence s kanchana 3 enters the rs 100 crore club

రాఘవా లారెన్స్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'కాంచన 3' చిత్రం బాక్సాఫీసు వద్ద పంబరేపుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు భాషల్లోను తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

తొలివారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఇంకా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. కథాకథనాలు .. లారెన్స్ చిత్రీకరణ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో, 'కాంచన 4'కి లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles