Balakrishna Brings 'Jai Simha' Director Back మళ్లీ వస్తున్న ‘జైసింహా’.. అదే కాంబినేషన్ మళ్లీ రిఫీట్..

Balakrishna signs one more film before boyapati s project

Nandamuri Balakrishna, jai simha, balakrishna new movie, balakrishna ks ravi kumar new movie, BalaKrishna Jai Simha, Balakrishna, ks ravi kumar, c Kalyna, vamsi kaka, tollywood, movies, entertainment

Nandamuri Balakrishna was occupied with political responsibilities after the release of NTR’s biopic. He signed a film for Boyapati Sreenu long ago But the project got delayed due to various reasons. Meanwhile KS Ravikumar will direct this project which will start rolling from May and complete shoot by August.

మళ్లీ వస్తున్న ‘జైసింహా’.. అదే కాంబినేషన్ మళ్లీ రిఫీట్..

Posted: 04/25/2019 10:26 PM IST
Balakrishna signs one more film before boyapati s project

‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం తరువాత నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కబురు వచ్చింది. బోయపాటితో ఓ సినిమాను చేస్తున్నారు.. ఆ విషయం మాకు తెలుసు అంటున్నారా..? కానీ అంతకన్నా ముందుగానే మరో ప్రాజెక్టుకు బాలయ్య రెడీ అవుతున్నారు. సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ, 2018 ఏడాది ‘జై సింహా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా.. మరోమారు అదే కాంబినేషన్ రిఫీట్ కానుంది.

నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది తరువాత ఇదే కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు పీఆర్ఓ వంశీ కాక. దీంతో బాలయ్య అభిమానుల్లో అప్పుడే చిత్రంపై కాక మొదలైంది.

మే నెలలో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ నెల నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నట్లు తెలియజేశారు వంశీ కాక. అయితే ‘జై సింహా’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా ఉండబోతుందా? హీరోయిన్‌గా నయన తారను రిపీట్ చేయనున్నారా? తదితర విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బోయపాటి దర్శకత్వంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తరువాతి మూవీ ఆగష్టు నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  jai simha  ks ravi kumar  c Kalyna  vamsi kaka  Balakrishna  tollywood  

Other Articles