JP Dutta releases Paltan Official Trailer దేశభక్తి ఉట్టిపడేలా.. పల్టాన్ ట్రైలర్..

After border and loc kargil jp dutta releases paltan official trailer

Paltan, Border, LoC Kargil, JP Dutta, China, Kargil, Arjun Rampal, Gurmeet Choudhary, Harshvardhan Rane, Jackie Shroff, Luv Sinha, Shariq Patel, Siddhanth Kapoor, Sonu Sood, Nathu La, Peoples Liberation Army, latest movie news, bollywood, movies, entertainment

writer-director JP Dutta brings alive on screen the bravery of our armed forces personnel with his war-epic Paltan. The film’s trailer releases today.

రోమాలు నిక్కపోడుచుకునేలా.. పల్టాన్ ట్రైలర్..

Posted: 08/02/2018 07:53 PM IST
After border and loc kargil jp dutta releases paltan official trailer

భారత్-చైనాల మధ్య 1962లో భీకరమైన యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. చైనా పీపుల్స్ లిబరేషన్ అర్మీ ముందు తమ బలాన్ని చూపుతున్నా.. అత్యంత చాకచక్యంగా వచ్చిన చైనాను నిలువరించడంలో విఫలమైంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ యుద్దంలో వందల సంఖ్యలో జవాన్లు అమరులయ్యారు. వందల సంఖ్యలో జవాన్లు గల్లంతయ్యారు. అదే వందల సంఖ్యలో క్షతగాత్రులై అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇలాంటి యుద్దం ఎప్పుడు వచ్చినా.. సిద్దంగా వుండాలని పిలుపునిస్తున్నారు.

ఆ తరువాత సరిగ్గా ఐదేళ్ల తర్వాత చైనా మరోసారి సిక్కింను, మిగతా దేశాన్ని కలుపుతున్న 'నాథులా పాస్'ను స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది. కానీ ఈసారి పూర్తి సన్నద్ధతతో ఉన్న భారత్ ఆర్మీ దీటుగా స్పందించడంతో చైనా భారీగా నష్టపోయి తోకముడిచింది. 'బోర్డర్', 'ఎల్వోసీ కార్గిల్' చిత్రాల దర్శకుడు జేపీ దత్తా ఇప్పుడీ ఘటన ఆధారంగా ‘పల్టన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేయగా, దానిని చూస్తున్నంత సేపు రోమాలు నిక్కపొడుచుకుని, దేశభక్తి ఉట్టిపడేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. జాకీష్రాఫ్, సోనూసూద్, అర్జున్ రాంపాల్,  సిద్ధార్థ్ కపూర్, గుర్మిత్ చౌధురి, హర్షవర్ధన్ రాణె, మోనికా గిల్, ఇషా గుప్తా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

‘సోదరసోదరీ మణులారా..! మన భూభాగంపై చైనా బలగాలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి’ అంటున్న నెహ్రూ రేడియో ప్రసంగంతో సినిమా ట్రైలర్ మొదలవుతుంది. సిక్కింను దక్కించుకునేందుకు చైనా సైన్యం యత్నించడం, దాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టే సీన్లు హైలైట్ గా నిలిచాయి. భారత బలగాలు బెదరకపోవడంతో ఇండియా-చీనీ భాయ్ భాయ్ అంటూ చైనా సైనికులు మైండ్ గేమ్ ఆడటం మనం చూడొచ్చు. చివరికి భారత్-చైనా సైన్యాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే సీన్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ చిత్రానికి అనూ మాలిక్ సంగీతం అందించగా.. జీ స్టూడియోస్, జేపీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paltan  Border  LoC Kargil  JP Dutta  China  Kargil  Peoples Liberation Army  Jackie Shroff  bollywood  

Other Articles