Priya Varrier Condemns Bollywood Movie News Fake | ప్రియా వారియర్.. అంతా ఫేక్ న్యూస్ లు!

Priya varrier all fake news

Malayalam, Priya Varrier, Priya Varrier Interview, Instagram Post, Simbaa Movie, Priya Varrier Interview

Malayali Actress Priya Varrier Responded on Bollywood News Offer. Says All Are Fake News and She Did not Even Charge that much for Instagram.

ప్రియా వారియర్.. అన్నీ ఫేక్ న్యూస్ లే!

Posted: 03/12/2018 04:39 PM IST
Priya varrier all fake news

ఒక కను సైగ, గీటడంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది నటి ప్రియా వారియర్. సినిమా విడుదల కాకముందే ఆమె పేరు దేశమంతా మారు మోగిపోతోంది. ఈ దెబ్బతో బాలీవుడ్ లోనూ ఆమెకు అవకాశాలు దక్కాయంటూ కథనాలు వినిపించాయి.

అయితే అదంతా ఉత్త ప్రచారమే అని ఆమె చెబుతోంది. తాజాగా ఓ జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా ఈ విషయాలను వెల్లడించింది. కేవలం రణ్ వీర్ తన ఫేవరెట్ అని చెప్పినందుకు సింబా(టెంపర్ ) రీమేక్ లో ఛాన్స్ దక్కిందని పుకార్లు సృష్టించారంట. ప్రస్తుతం తాను ఏ చిత్రానికి సైన్ చేయలేదని ఈ స్లిమ్ బ్యూటీ చెబుతోంది.

ఇక తనకు ఫోన్ ఉంది కానీ అందులో సిమ్ లేదని, సోషల్ మీడియాలో పోస్ట్ కు ఆమె 8 లక్షలు తీసుకుంటుందన్న వార్తలను కూడా ఖండించింది. తనను ఇప్పటికీ ఇంట్లో ఫోన్‌ వాడనివ్వరని తెలిపింది. మరీ అవసరమైతే తన తల్లి ఫోన్ వాడుతుంటానని చెప్పింది. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉంటేనే ఫోన్ వాడతానని ఆమె వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles