Senior Artist Vankayala Satyanarayana Passes Away | సీనియర్ నటుడు వంకాయల ఇక లేరు

Tollywood artist vankayala passes away

Vankayala Satyanarayana, Tollywood, Passes Away, Respiratory Illness

Tollywood Senior Actor Vankayala Satyanarayana Passes Away. He has been suffering from a respiratory illness for some time. He has acted in more than 180 films as a character actor.

నటుడు వంకాయల కన్నుమూత

Posted: 03/12/2018 04:03 PM IST
Tollywood artist vankayala passes away

టాలీవుడ్ సీనియర్ నటుడు వంకాయల(78) ఇక లేరు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న ఆయన సోమవారం ఉదయం వైజాగ్ లో కన్నుమూశారు.

వంకాయల పూర్తి పేరు వంకాయల సత్యనారాయణ. పుట్టింది, పెరిగింది విశాఖపట్నంలోని చవల వారి వీధి. ఆయన ‘సీతామాలక్ష్మి’, ‘శ్రీనివాస కల్యాణం, శుభలేఖ’ వంటి హిట్ సినిమాల్లో నటించారు. చివరగా శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఆయన కనిపించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోగా.. కొంత కాలంగా తన కుమార్తె ఇంట్లో కొంత కాలంగా ఉంటున్నారు.

సుమారు 180కి పైగా సినిమాల్లో నటించమే కాకుండా టీవీ సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు విశేష్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles