Small Screen Actress Cheated by Event Organiser | బుల్లితెర నటికి ప్రోగ్రామ్ పేరుతో ఈవెంట్ ఆర్గనైజర్ టోకరా

Event manager cheated serial actress

Shikha Singh, Shikha Singh Complaint, Shikha Singh Cheat, Event Organizer Cheat Actress, Kundali Bhagya Actress

Kumkum Bhagya, Kundali Bhagya actress Shikha Singh cheated of Rs 11 lakh, files complaint. Actress files cheating complaint of Rs 11 lakh against event organiser.

సీరియల్ నటికి ఈవెంట్ మేనేజర్ టోకరా

Posted: 02/26/2018 12:45 PM IST
Event manager cheated serial actress

హిందీ బుల్లితెరపై కుంకుమ భాగ్య, కుండలి భాగ్య సీరియళ్లతో మంచి పేరు సంపాదించుకున్న నటీమణి శిఖా సింగ్ (32) పోలీసులను ఆశ్రయించారు. ఓ ఈవెంట్ మేనేజర్ తనను మోసం చేశాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనటంతో కేసు నమోదు అయ్యింది.

గతేడాది ముంబై బోరివిల్ నివాసి అయిన సదరు ఈవెంట్ మేనేజర్ ఘనాలో కార్యక్రమం ఉందంటూ రూ.11 లక్షలకు శిఖాతో ఒప్పందం కుదుర్చున్నాడు. ఇందుకుగానూ తొలుత 70 వేలు చెల్లించాడు. ఈ కార్యక్రమంలో జూలైలో జరగాల్సి ఉంది. తర్వాత అది నవంబర్ కు వాయిదా పడింది. అయితే మిగిలిన ఎమౌంట్ ప్రోగ్రాం అయ్యాక తీసుకోవచ్చని భావించిన ఆమె ఈవెంట్ లో పాల్గొన్నారు. తీరా కార్యక్రమం ముగిసిన తర్వాత శిఖాసింగ్ మిగిలిన పారితోషికం కోసం నిర్వాహకులను సంప్రదించింది. వారు ఆమెకు సంబంధించిన పారితోషికం మొత్తాన్ని చతుర్వేదికి ముట్టజెప్పామని చెప్పారు. కంగుతిన్న ఆమె ఈవెంట్ మేనేజర్ ను నిలదీయగా.. అతను తప్పించుకు తిరుగుతున్నాడు.

దీంతో ఆమె చితల్సార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 420 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు దీపక్ చతుర్వేది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles