South Senior Actress Worried with Twitter Hacked | ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. సమస్య నుంచి బయటపడేదాకా...

Radhika sarathkumar twitter hacked

Actress Radhika Sarathkumar, Radhika Twitter, Actress Twitter Hack, Twitter Hacked, Radhika Sarathkumar

Actress Radhika Sarathkumar Says Twitter Account Hacked. She Requested Followers to Bear till such Problem Sort Out.

నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది : శరత్ కుమార్

Posted: 02/26/2018 09:56 AM IST
Radhika sarathkumar twitter hacked

టెక్నాలజీ సెలబ్రిటీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. తమ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి.. హ్యాకింగ్ పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది. హ్యాకర్లు అసభ్యకరమైన పోస్టులతో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్ ట్విట్టర్ హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్నారు.

ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేదాక నాకు మద్ధతుగా నిలవాలంటూ’ నటి రాధిక ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఆమె ఫాలోయర్లు రీ-ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, ఇటీవలె రాజా ది గ్రేట్ సినిమాలో నటించిన ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై రాజకీయాలపై దృష్టిసారించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles