Tollywood Pays Condolence to Sridevi | అందాల తార నిష్క్రమణకు టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Tollywood pay homage to sridevi

Sridevi Died, Tollywood Celebrities, Condolence, Chiranjeevi About Sridevi, Pawan Kalyan Sridevi, Tollywood Mourns Tribute to Tollywood

Tollywood Celebrities pay homage to Sridevi. This Veteran Actress Suddenly died with Heart Attack in Dubai. Tollywood Heroes Chirajaneevi, Pawan Kalyan, Mahesh Babu, Allu Arjun, Ravi Teja, Nani, SS Rajamouli etc Condolence to Her Family.

శ్రీదేవి మృతిపై టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Posted: 02/25/2018 04:00 PM IST
Tollywood pay homage to sridevi

శ్రీదేవి మరణంపై టాలీవుడ్ ప్రముఖులంతా స్పందించారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని.. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెబుతున్నారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు. శ్రీదేవి తమ ఇంట్లో పెరిగిన పిల్ల అని ఆయన అన్నారు. చెన్నైలో తమ ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు ఉండేదని ఆయన చెప్పారు. ఆమె తనతోనే అత్యధికంగా 31 చిత్రాలు చేసిందన్నారు. ఆమె మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆయన చెప్పారు. తమ నరేశ్, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులని ఆయన అన్నారు.

మరో నటుడు కృష్ణంరాజు కూడా ఆమె గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మహా నటీమణులు సావిత్రి, భానుమతి మినహా శ్రీదేవి మాదిరిగా నటించే వారు ఎవ్వరూ లేరని ఆయన కొనియాడారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయిందని ఆయన అన్నారు.

అందం, అభినయం కలబోసిన అద్బుతమైన నటి, అతిలోకసుందరి శ్రీదేవి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని చెప్పారు. మా అతిలోక సుందరి ఈ విధంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే... తనకు మింగుడు పడటం లేదని అన్నారు. ఇదొక చేదు నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని... ఇంత చిన్న వయసులోనే ఆమెను తీసుకెళ్లిపోయాడని అన్నారు.

చిన్నతనం నుంచి శ్రీదేవికి నటన తప్ప మరొకటి తెలియదని... మరో ధ్యాస, మరో వ్యాపకం ఆమెకు లేదని చెప్పారు. అంతటి అంకితభావం ఉన్న నటీమణిని మనం చూడలేమని తెలిపారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని, స్పూర్తి పొందానని చెప్పారు.

భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసుకున్న శ్రీదేవి హఠాన్మరణం నమ్మలేనిదని ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు. "అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షకలోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి ఇకలేరు అనే మాట నమ్మలేనిది. కానీ ఆమె చేసిన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. ఆమె భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఆమె కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యాన్ని ఆ భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. తెలుగులో బడిపంతులు చిత్రంలో 'బూచాడమ్మ బూచాడు' అనే పాటలో ఆమె కళ్లు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.

అదే విధంగా అన్నయ్యతో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో దేవకన్య ఇంద్రజగా ఆమె కనిపించిన తీరు, 'మానవా' అంటూ ఆమె చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకునేవే. ఆమె అమాయకత్వపు నటన మరువలేనిది. కొంత విరామం తర్వాత హిందీలో ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ చిత్రాల ద్వారా శ్రీదేవి తన శైలి నటనను ఈ తరానికీ చూపించారు. శ్రీదేవి తన పెద్ద కుమార్తెను కథానాయికగా చిత్రసీమకి తీసుకువస్తున్న తరుణంలో ఆమె ఈ లోకాన్ని వీడిపోవడం బాధాకరం" అంటూ జనసేన పార్టీ తన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh