EC Allots Auto Rickshaw Symbol for Kannada Star Hero | ఉప్పీ పార్టీకి గుర్తు.. వెరైటీ అని మళ్లీ ప్రూవ్ చేశాడు

Uppi party got symbol

Actor Upendra, KPJP, Auto Rickshaw Symbol, Election Commission, Karnataka Politics, Upendra Party EC, KPJP Symbol

Election Commission allots Auto Rickshaw symbol for actor Upendra, KPJP. Uppi Says he want to bring about change in politics at Belgavi Press Meet.

ఉపేంద్ర పార్టీకి ఆటో రిక్షా గుర్తు

Posted: 12/11/2017 05:24 PM IST
Uppi party got symbol

రాజకీయాలను చేయటం తన ఉద్దేశంతోనే కాదని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయాల్లోకి వచ్చినట్లు కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రకటించాడు. `క‌ర్ణాట‌క ప్ర‌జ్ఞావంత జ‌న‌తా ప‌క్ష‌` పేరుతో పార్టీ పెట్టిన ఆయన ఇప్పటికే సమావేశాలు, ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పార్టీ గురించి మరో అప్ డేట్ అందింది.

ఆటోరిక్షా గుర్తును ఆయన పార్టీ గుర్తుగా ఎన్నిక‌ల క‌మిష‌న్ జారీ చేసింది. దీని గురించి మీడియాకు తెల‌ప‌డానికి ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఉపేంద్ర స్వయంగా ఆటోరిక్షా న‌డుపుకుంటూ వ‌చ్చి హాజ‌ర‌య్యారు. పార్టీ ల‌క్ష్యాల‌ను ప్ర‌తిబింబించేలా ఆటోరిక్షా గుర్తు ఉందని ఉపేంద్ర అన్నారు. 'ఆటో అంటే ఇంగ్లిషులో స్వీయనియంత్రణ కలిగి ఉండేదని అర్థం. ప్ర‌జ‌లు ఎన్నుకోబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి అని పార్టీ గుర్తుకు ఉపేంద్ర సరికొత్త భాష్యం చెప్పారు.

ఎలాంటి స‌మ‌స్య‌లు సృష్టించ‌కుండా, ఉన్న స‌మ‌స్య‌ల‌ను పార‌ద్రోలి త‌నంత‌ట తానే మంచి పాల‌న సాగించే వాడే నిజమైన నాయకుడని ఉపేంద్ర వెల్లడించారు.

ఉపేంద్ర పార్టీ వివరాలు తెలుసా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles