Kamal Haasan Vishwaroopam 2 Shooting final Stage | విశ్వరూపం-2 షూటింగ్ అయిపోతుంది. మరి రిలీజ్ డేట్?

Vishwaroopam 2 movie shooting progress

Kamal Haasan, Vishwaroopam 2 Movie, Vishwaroopam 2 Movie Updates, Vishwaroopam 2 Movie Final Shoot, Vishwaroopam 2 Movie Release Date

Kamal Haasan Vishwaroopam 2 Movie goes back on floors, team resumes final week of shoot.

షూటింగ్ ముగింపు దశలో విశ్వరూపం-2

Posted: 11/28/2017 12:34 PM IST
Vishwaroopam 2 movie shooting progress

గత కొంత కాలంగా రాజకీయాలతోనే వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఉళగనాయగన్ కమల్ హాసన్ ఎట్టకేలకు మళ్లీ చిత్రాలపై దృష్టి సారించాడు.

స్పై థ్రిల్లర్ విశ్వరూపం-2 షూటింగ్ ను ముగించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం కొంచెం టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉండటంతో వారం షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. ప్యాచ్ వర్క్ తో పాటు పూర్తి షూటింగ్ ఈ షెడ్యూల్ తో పూర్తయిపోతుంది. పూజా కుమార్, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

నిజానికి సింగిల్ చిత్రంగానే విశ్వరూపం చిత్రం తెరకెక్కినప్పటికీ.. లెంగ్త్ ఎక్కువ కావటంతో రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు కమల్ సిద్ధమయ్యాడు. కానీ, ఎందుకనో రెండో పార్ట్ డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇఫ్పుడు చిత్ర షూటింగ్ పూర్తి కావస్తుండటంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పే పరిస్థితులు కనిపించటం లేదు. హైఎమోషనల్ కంటెంట్ డ్రామాగా ఇది తెరకెక్కబోతుందని సమాచారం. ఇది కాకుండా శభాష్ నాయుడు ప్రాజెక్టు సంగతి కూడా తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles