Anushka Two Years Hard Work Result | రెండేళ్ల కష్టం, చెమట.. అనుష్క ఇప్పుడు ఇలా...

Anushka transformation slim avatar

Anushka Shetty, Anushka Shetty Slim Avatar, Anushka Shetty Slim Look, Anushka Shetty Hard Work, Anushka Shetty Hard Work Sweat, Anushka Shetty Bhaagamathie Movie

Anushka Shetty again in Slim Avatar. Two Years Ago for Size Zero She Became very Fat. Now she reminds her old look.

స్లిమ్ లుక్కులోకి మారిన అనుష్క

Posted: 11/28/2017 12:59 PM IST
Anushka transformation slim avatar

సైజ్ జీరో సినిమా మూలంగా భారీగా పెరిగిన అనుష్క తర్వాత తగ్గేందుకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. బాహుబలి కోసం గ్రాఫిక్స్ ను ఆశ్రయించినప్పటికీ.. తర్వాతి చిత్రాల కోసం మాత్రం ఖచ్ఛితంగా సన్నబడాల్సిన అవసరం వచ్చింది.

వర్కవుట్ లు చేసి ఎంతో కష్టపడ్డ అనుష్క ఎట్టకేలకు మళ్లీ స్లిమ్ గా మారిపోయింది. తన తాజా ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. కొత్త అందంతో, బాబ్డ్ హెయిర్ తో ఆమె సరికొత్తగా కనిపిస్తోంది. ఈ ఫొటో కింద ఆమె ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. 'మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవు. అది సాధ్యం కావాలంటే చెమట చిందించాలి. కష్టించే తత్వం, పట్టుదల, ధృడ సంకల్పం అవసరం' అని పేర్కొంది.

ప్రస్తుతం భాగ్ మతి చిత్రంలో నటిస్తున్న అనుష్క, గౌతమ్ మీనన్ కొత్త ప్రాజెక్టు కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు. ఇవి కాకుండా చిరు 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో కూడా ఆమె నటించబోతుందన్న వార్త చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles