Bhuvaneshwari's Son Arrested on harassment charge | యువతికి వేధింపులు.. ’వ్యాంప్‘ భువనేశ్వరి కొడుకు అరెస్ట్

Actress bhuvaneswari son arrest

Actress Bhuvaneshwari, Midhun Srinivasan, Bhuvaneshwari Son Arrest, Bhuvaneshwari Son Harassment Charge

Actress Bhuvaneshwari Son was arrested on Tuesday by the Tirumangalam police on charges of harassing a third-year MBBS student and allegedly threatening to pour kerosene on her. According to police.. Midhun Srinivasan (23) is the son of Bhuvaneshwari. He was arrested based on a complaint from a third-year MBBS students who claimed that he has been stalking her on social media and has been harassing her in person.

యువతికి వేధింపులు.. నటి భువనేశ్వరి కొడుకు అరెస్ట్

Posted: 11/16/2017 09:26 AM IST
Actress bhuvaneswari son arrest

వ్యాంప్ తరహా క్యారెక్టర్లతో దాదాపు అన్ని సౌత్ భాషల్లోని చిత్రాల్లో నటించిన నటి భువనేశ్వరి గుర్తుందిగా.. ఆమె కుమారుడు ఓ యువతిని వేధించిన కేసులో ఇప్పుడు జైలు పాలయ్యాడు. యువతి ఫిర్యాదు మేరకు మంగళవారం సాయంత్రం తిరుమంగళం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

చెన్నైలోని ఏంజల్ వీధిలో భువనేశ్వరి, ఆమె కుమారుడు మిధున్ శ్రీనివాసన్ (23) నివాసం ఉంటున్నారు. అన్నానగర్ లోని ఓ యువతితో మిథున్ కు తొమ్మిదో తరగతి నుంచే పరిచయం. ఈ క్రమంలో ఈ మధ్యే ఆమెను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా యాడ్ చేసుకుని మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే కొంత కాలం తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ వేధించటం మొదలుపెట్టాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు.

ఇటీవల మిధున్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి కూడా గొడవ చేసి సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశాడు. అప్పటికీ అమ్మాయి మెత్తబడక పోవడంతో ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి గొడవ చేశాడు. ఇక మిధున్ వేధింపులు తాళలేక, బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయమం చెప్పి తిరుమంగళం పోలీసులను ఆశ్రయించింది. దీంతో మిధున్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles