Pooja Kumar to play Lakshmi Parvathi in NTR Biopic | లక్ష్మీస్ వీరగ్రంథం. లక్ష్మీ పార్వతి రోల్ కు ఈమె కన్ఫర్మ్

Actress confirmed for lakshmi parvathi

Lakshmi’s Veera Grandham, Pooja Kumar, Pooja Kumar Lakshmi Parvathi, Director Kethireddy Jagadeeswar Reddy, Mahesh Manjrekar as NTR

Pooja Kumar being roped in to play Lakshmi Parvathi role in Lakshmi’s Veera Grandham. Director Kethireddy Jagadeeswar Reddy confirmed it.He also plans to rope in Mahesh Manjrekar to play NTR.

లక్ష్మీ పార్వతి రోల్ లో పూజా కుమార్

Posted: 11/16/2017 09:45 AM IST
Actress confirmed for lakshmi parvathi

ఆ వీపు ఎవరిదో తెలిసిపోయింది. లక్ష్మీస్ వీర గ్రంథం పేరిట నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎవరిదో తెలిసి పోయింది. తొలుత రాయ్ లక్ష్మీ ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు వార్తలు రాగా.. చివరకు పూజా కుమార్ ను ఆ అదృష్టం వరించింది.

ఈ విషయాన్ని కేతిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ధ్రువీకరిస్తూ, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను తన టైమ్ లైన్ లో షేర్ చేసుకున్నారు. వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న విషయమై తాను సినిమా తీయనున్నట్టు ఇప్పటికే కేతిరెడ్డి స్పష్టం చేశారు. కమల్ హాసన్ విశ్వరూపం, ఉత్తమ విలన్, రీసెంట్ గా రాజశేఖర్ గరుడ వేగలో పూజా కుమార్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Pooja Kumar NTR Biopic

అయితే డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా రాయ్ లక్ష్మి తప్పుకోగా, పూజాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషించబోతుండగా.. వీర గ్రంథం పాత్రను ఎల్బీ శ్రీ రాం పోషిస్తాడని చెప్పుకుంటున్నారు. మరి షూటింగ్ కు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో కేతిరెడ్డి ఈ ప్రాజెక్టును ఎలా తెరకెక్కిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles