Manchu Manoj's Okkadu Migiladu in Another Controversy | మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు దర్శకుడి ఆవేదన.. ఏషియన్ వారితో వివాదం

Okkadu migiladu in another controversy

Okkadu Migiladu, Ajay Andrews, Asian Sunil, Ajay Andrews Asian Sunil Fight, Dil Raju Okkadu Migiladu Controversy,Okkadu Migiladu Director, Okkadu Migiladu Brawling, Okkadu Migiladu Controversy

Less Theaters for Manchu Manoj's Okkadu Migiladu Movie. Asian Cinemas Sunil versus Director Ajay Andrews fight with each other in Dil Raju's Office.

ఒక్కడు మిగిలాడుకు థియేటర్ల కొరత? వివాదం

Posted: 11/07/2017 11:33 AM IST
Okkadu migiladu in another controversy

మంచు మనోజ్ కొత్త చిత్రం ఒక్కడు మిగిలాడు మరోసారి వివాదాల్లో నిలిచింది. గతంలో వైజాగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో దాడితో ఈ చిత్రం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి థియేటర్ల కొరత మూలంగా తెరపైకి వచ్చింది.

విషయం ఏంటంటే...

హైదరాబాద్ లోని ఏసియన్ థియేటర్స్ అధినేత సునీల్ తో సినీ దర్శకుడు అజయ్ వాగ్వాదానికి దిగారు. నిజానికి చిత్రానికి 50 థియేటర్లు కేటాయించాల్సి ఉంది. అయితే సునీల్ మాత్రం డబ్బింగ్ సినిమాలకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో  ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా యూనిట్, సునీల్ కు మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. తమ చిత్రానికి థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, డబ్బింగ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నారని దర్శకుడు అజయ్ ఆరోపించారు. దీనికి సునీల్ ప్రతి విమర్శలు చేశారు. వంద మందిని వెంటేసుకుని వచ్చి తనను బెదిరిస్తున్నారని అజయ్ మండపడ్డారు.

చాలా సినిమాలు విడుదలవుతున్నాయని, వాటికీ థియేటర్లు ఇవ్వాలని, రౌడీయిజం చూపిస్తే థియేటర్లు రావని మీడియాతో ఆయన అన్నారు. దిల్ రాజు ఆఫీస్ లో వీరిద్దరు భౌతిక దాడి చేసుకున్నట్లు వార్తలు వస్తుండటం.. ప్రస్తుతం ఈ వివాదం సినీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles