Garudavega First Weekend Collections Report | ఒక్క ఆదివారం మొత్తం చిత్ర ఫేట్ ను మార్చేసింది

Garuda vega weekend collections

PSV Garuda Vega, Garuda Vega Collections, Garuda Vega Weekend Collections, Praveen Sattaru Nthiin

Garudavega First Weekend Collections Report. ajasekhar Starrer almost collections 60 percent amount in just three days. Now Garuda Vega Screens increased. Garudavega getting good satellite and digital offers. Nithiin announced his new movie with director Praveen Sattaru.

పీఎస్వీ గరుడ వీకెండ్ కలెక్షన్లు

Posted: 11/07/2017 11:09 AM IST
Garuda vega weekend collections

హీరో రాజశేఖర్ కి 'గరుడవేగ' కమ్ బ్యాక్ హిట్ గా నిలిచింది. అయితే తొలిరోజు కోటి లోపు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆదివారం నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మౌత్ టాక్ అంతకు మించి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యాడు.

తొలి రోజున ఓపెనింగ్స్ భారీస్థాయిలో లేకపోయినా, తర్వాత థియేటర్స్ సంఖ్య పెంచవలసి వచ్చింది. తొలి మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.35 కోట్ల షేర్ ను .. 4.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 3.25 కోట్ల షేర్ ను .. 6.65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'గరుడ వేగ'కి ముందు వచ్చిన సినిమాలు .. తరువాత వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు.

మొత్తం 11 కోట్లు వసూలు చేస్తేనే నిర్మాతలు సేఫ్ జోన్ కి వచ్చేస్తారు. అంటే మరో 5 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ వారం రిలీజ్ అయ్యే చిత్రాలపైనే గరుడ వేగ కలెక్షన్లు ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి శాటిలైట్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగొచ్చనే చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 4 కోట్లు చెల్లించేందుకు జెమిని, జీ ఛానెల్ వాళ్లు ముందుకు రాగా.. నిర్మాతలు మాత్రం 5 కోట్లు ఆశిస్తున్నారు. హిందీ రైట్స్ 2.5 కోట్ల దాకా పలుకుతున్నప్పటికీ... 3.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట.

నితిన్ తో తర్వాతి చిత్రం... 

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో హీరో నితిన్ తో ఆయన తన తదుపరి చిత్రం తీయబోతున్నాడంట. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో తెలియజేశాడు. సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో చిత్రం ఉండబోతుందని.. వివరాలు త్వరలో తెలియజేస్తానని నితిన్ ట్వీట్లో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles