Suriya Next Under Selvaraghavan Direction | ఆ దర్శకుడితో సూర్య సినిమా.. ఫ్యాన్స్ లో ఒకటే టెన్షన్...

Suriya new movie announcement

Suriya, Suriya New Movie, Suriya 36 Movie, Suriya Next Movie, Suriya Selvaraghavan, Selvaraghavan Movie, Selvaraghavan Suriya

Suriya Sivakumar 36th film directed by Selvaraghavan to begin shoot in January 2018. Produced by Dream Warrior pictures, it is Suriya’s 36th film and is expected to release by Diwali 2018. Suriya is currently awaiting the release of Thaana Serndha Kootam directed by Vignesh Shivan.

సెల్వ రాఘవన్ తో సూర్య చిత్రం

Posted: 10/30/2017 06:09 PM IST
Suriya new movie announcement

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ చిత్రం స్పెషల్ ఛబ్బీస్ నుంచి కొంచెం కంటెంట్ తీసుకుని థానా సెరందా కూటమ్ తెరకెక్కిస్తున్నారు.కీర్తి సురేశ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తుండగా.. ఆ పాటలు ఇప్పడు తమిళనాట ఓ ఊపు ఊపుతున్నాయి.

జనవరి 18న ఈ చిత్రం విడుదలకానుంది. ఇదిలా ఉంటే సూర్య మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. తన 36వ చిత్రం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పేశాడు. థానా సెరందా.. రిలీజ్ అయ్యాక కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడంట. అయితే ఈ వార్త ఆయన అభిమానుల్లో కలవరం పుట్టిస్తోంది.

అందుకు కారణం సెల్వ రాఘవన్ ట్రాక్ ఈ మధ్య సరిగ్గా లేకపోవటమే. దీనికి తోడు చిత్ర నిర్మాతలతో గొడవల కారణంగా రాఘవన్ చిత్రాలు కూడా ఆగిపోతున్నాయి కూడా. అంతెందుకు సూర్యతోనే గతేడాది ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసి మరీ ప్రాజెక్టును సెల్వ రాఘవన్ కాన్సిల్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం విషయంలో అయినా ఖచ్ఛితంగా ఉంటాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selvaraghavan  Suriya  సూర్య  సెల్వ రాఘవన్  

Other Articles