Anushka Again Arundati Pattern with Bagmati | అనుష్క భాగమతి.. మరో అరుంధతి స్టోరీనా?

Anushka role in bagmati

Anushka Shetty, Anushka Shetty Bagmati, Bagmati Movie, Anushka's Bagmati, Bagmati First look, Anushka's Bagmati Movie First look, Bagmati Movie First look Poster, Anushka's Birthday

Anushk Shetty Upcoming Movie bagmati Firstlook may release on Actress Birthday. In the Movie Anushka play dual roles.

భాగమతిలో డ్యుయెల్ రోల్??

Posted: 10/28/2017 08:28 AM IST
Anushka role in bagmati

దాదాపు అవకాశాలు దారుణంగా తగ్గిపోవటంతో ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతుందా? అన్న టైంలో.. బాహుబలి మళ్లీ అనుష్కకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. అయితే అదే ఊపులో వరుస చిత్రాలు చేస్తుందనుకుంటే.. ఆచీ తూచీ ప్రాజెక్టులను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే భాగమతి.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుని మరీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై యూవీ క్రియేషన్స్ వాళ్లు కూడా ఇప్పటికే చాలా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు భాగమ‌తి చిత్రంలో ఆమె ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో ఒక పాత్ర ప్రేక్ష‌కులు ఊహించని రీతిలో ట్విస్ట్ తో సాగుతుందని.. అరుంధతి జేజేమ్మ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

అలాగే న‌వంబ‌ర్ 7న అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి, మళయాళ సీనియర్ నటుడు జయరాం, ఆశా శరత్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles