Actress clarifies on sex scandal video with Swamiji | ఇంతకీ ఆ సెక్స్ క్లిప్ లో ఉన్న నటి ఏం చెబుతోంది?

Kannada swamiji video actress

Kannada Actress, Kannada Actress Dayanada Swamiji, Dayanada Swamiji Video, Dayanada Swamiji Actress, Actress Dayanada Swamiji Video, Actress Clarify on Sex Clip, Actress Clip Blackmail, Actress Blackmail Dayanand

Kannada actress clarifies on sex scandal video with Dayananda Swami. The actress who was alleged to be in the intimate video with seer Dayananda Swami said that the video might have been morphed. Actres stressed that she was not the girl in the video. But, Some Media sources quoted that Dayanand Swamiji Honey Trapped By Actress, Video Released When He Didn't Pay Her 25 Lacs Rupees.

కన్నడ కామ బాబా వీడియో.. హీరోయిన్ కాదా?

Posted: 10/28/2017 08:54 AM IST
Kannada swamiji video actress

భక్తి ముసుగు కప్పుకున్న ఓ స్వామీజీ బాగోతం బెంగళూర్ లో మొన్నీమధ్యే వెలుగు చూడటం తెలిసిందే. ఎల్హంక‌లో హునసేమారేనహళ్ళి మఠాధిపతి పర్వతరాజు కుమారుడు దయానంద అలియాస్ నంజేశ్వర స్వామి రాసలీలలు వెలుగులోకి రావటం కలకలం రేపాయి.

ఓ నటితో శృంగారంలో పాల్గొన్న సమయంలో రహస్య కెమెరాల ద్వారా ఆ దృశ్యాలను బంధించారు. అయితే వీడియోలు మీడియాకు చిక్కటంతో రెండు రోజులుగా అక్కడ ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు వాట్సాప్, సోషల్ మీడియాల్లో కూడా ఇది ఇప్పడు తెగ వైరల్ అవుతోంది. కన్నడలో మూడు,నాలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా చెబుతూ అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రత్యక్షంగా పేరు చెప్పనప్పటికీ.. పరోక్షంగా వీడియోలో ముఖం చూపించటంతో ఇప్పుడు అక్కడ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

అయితే వీడియోలో ఉంది తాను కాదని.. మార్ఫింగ్ చేసినట్లు హీరోయిన్ చెబుతోంది. దయానంద్ ఎవరో తనకు తెలీదని. దయచేసి తనను ఈ అంశంలోకి లాగొద్దంటూ సదరు నటి విజ్నప్తి చేస్తోంది. కానీ, కొన్ని మాధ్యమాలు మాత్రం డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేసిందన్న రీతిలో కథనాలు వెలువరుస్తున్నాయి. ఆమె దయానంద్ ను 25 లక్షలు డిమాండ్ చేసిందని, చెల్లించకపోవటంతోనే ఇలా లీక్ చేసిందని అంటున్నారు.

 

స్వామీజీ మాములోడు కాదు...

500 ఏళ్ల చరిత్రకలిగిన హుణసేమారేనహళ్ళి మఠానికి అక్క‌డ చాలా మంచి పేరు ఉంది. ఈ మ‌ఠానికి చాలా యేళ్ల నుంచి పర్వ‌త‌రాజు పీఠాధిప‌తిగా ఉన్నారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు ఉన్నారు. రెండో భార్య కుమారుడైన దయానంద పదో తరగతిలో డీబారై, జులాయిగా తిరుగుతున్నాడు. దయానంద చాలా జ‌ల్సా జీవితానికి అల‌వాటు ప‌డ్డాడు. అమ్మాయిల‌తో విచ్చ‌ల‌విడిగా తిరిగేవాడు. మ‌ఠానికి వ‌చ్చిన వారిని ఏదోలా లోబ‌ర‌చుకునేవాడని పలువురు చెబుతున్నారు.

అతడిని 2011లో పీఠాధిపతిగా చేసేందుకు పర్వతరాజు ప్రయత్నించారు. అయితే ట్రస్టు సభ్యుల వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా అత‌డు ఓ ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టితో రాస‌లీల‌లు చేస్తోన్న వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. మూడు ప్ర‌ముఖ క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన ఓ హిట్ హీరోయిన్‌తో అత‌డికి అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ టాక్ కూడా ఉంది. ఇది క‌న్న‌డ నాట మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles