Vamsi Paidipally Rubbishes Mahesh Movie Title | మహేష్ కోసం టైటిళ్లు.. ఎవరు చెప్పారు?

Clarity on mahesh 25th movie title

Mahesh Babu, Mahesh 25th Movie Title, Mahesh Babu Movie Title Fix, No Soft Title for Mahesh Babu, Mahesh Babu New Movie Title, Mahesh Movie Title, Mahesh Babu Dil Raju

Director Vamsi Paidipally Rubbishes Mahesh Babu 25th Movie Title. Mukunda Murari, Hare Rama Hare Krishna titles Not Consider for Mahesh.

మహేష్ 25 టైటిల్ అది కాదంట!

Posted: 10/27/2017 04:32 PM IST
Clarity on mahesh 25th movie title

భరత్ నేను సినిమా సెట్స్ లో ఉండగానే.. తర్వాతి చిత్రం షూటింగ్ లో పాల్గొనాలని సూపర్ స్టార్ మహేష్ బాబు డిసైడ్ అయిపోయాడు. స్పైడర్ డిలే మూలంగానే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తర్వాతి ప్రాజెక్టు మాత్రం 25వ సినిమా కావటంతో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.

స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ ఈ చిత్రాన్ని చేయనున్నాడు. పీవీపీ సైడ్ కావటంతో దిల్ రాజు - అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి విదేశాల్లో లొకేషన్స్ వేటలో వున్నాడు. దేవీశ్రీప్రసాద్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఈ సినిమా కోసం 'హరేరామ హరే కృష్ణ' .. 'కృష్ణా ముకుందా మురారి' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ రెండింటిలో 'కృష్ణా ముకుందా మురారి' టైటిల్ ను ఓకే చేయవచ్చని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన వంశీ పైడిపల్లి, ఈ సినిమా కోసం ఇంకా ఏ టైటిల్ అనుకోలేదనీ .. ఫిక్స్ చేసుకుంటే వెంటనే తెలియజేస్తామని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. ఇక ఈ తరహా టైటిల్స్ తనకి కలిసి రాలేదనే ఉద్దేశంతోనే దిల్ రాజు వాటిని పక్కన పెట్టేశాడనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles