Tamanna Tribute to Talaiva in Hindi Show | చిట్టి రోబోలో ఉన్న మన హీరోయిన్ ఎవరంటే...

Tamanna in lip sing battle

Irfan Pathan-Tamannaah Bhatia, Tamannaah Rajinikanth, Tamannaah Chitti Robo, Tamanna Robo Get Up, Tamanna imitates Rajinikanth

Irfan Pathan-Tamannaah Bhatia in Farah Khan's Lip Sing Battle Show, Tamanna Tribute to Talaiva in Chitti Robot Get Up.

తమన్నా యాజ్ చిట్టి రోబో

Posted: 10/27/2017 03:41 PM IST
Tamanna in lip sing battle

హాలీవుడ్ షో లిప్ సింక్ బ్యాటిల్ ప్రేరణతో హిందీలో లిప్ సింగ్ బ్యాటిల్ అనే ఓ కార్యక్రమం నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కార్యక్రమంలో వారం వారం సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. ఇప్ప‌టికే శిల్పా శెట్టి, ర‌వీనా టాండ‌న్‌, షారుక్ ఖాన్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సానియా మీర్జా తదితర సెలబ్రిటీలు జంటగా పాల్గొన్నారు.

పాట‌లు పాడుతూ ఆయా గెట‌ప్‌లు వేసుకుని డ్యాన్సులు చేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం కాన్సెప్ట్. ఇప్పుడు మరో నటి ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చిట్టి రోబో గెటప్ వేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా?.అదెవరో కాదు... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. గెటప్ రౌండ్ లో భాగంగా ఇలా వేషం వేసుకుని సందడి చేసింది.

క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో క‌లిసి ఆమె ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. రోబో గెటప్‌లో ఉన్న ఫొటోను తమన్నా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్‌కి ఇది నా ట్రిబ్యూట్‌. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నటించలేదు’ అని పేర్కొంది.రోబో గెట‌ప్‌లో ర‌జ‌నీని అనుకరిస్తూ త‌మ‌న్నా షోలో చేసిన అల్ల‌రి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles