classical vocalist Girija Devi Passes Away | థుమ్రి క్వీన్ గిరిజా కన్నుమూత.. దేశం ఘన నివాళి

Legendary singer passes away

Girija Devi, Girija Devi Dies, Girija Devi Death, Girija Devi News, Girija Devi Banaras Gharana Singer Girija Devi Thumri Renditions, Girija Devi Appaji, Girija Devi, Girija Devi, Banaras Gharana Singer

Banaras Gharana Singer Girija Devi Passes away. Renowned for her superlative thumri renditions Girija Devi Called as Appaji by her fans. Along with India PM Modi, Lata Mangeshkar And Others Pay Tribute to her demise.

లెజెండరీ సింగర్ గిరిజా దేవి కన్నుమూత

Posted: 10/25/2017 11:26 AM IST
Legendary singer passes away

ప్రముఖ క్లాసికల్ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత గిరిజాదేవి (88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్‌కతాలోని బీఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్‌ ఆసుపత్రిలో చేరిన ఆమె.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. థుమ్రి క్వీన్‌గా ఆమె బాగా ప్రసిద్ధిగాంచారు.

బనారస్ సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో జమీందారు కుటుంబంలో పుట్టిన గిరిజాదేవి సంగీతాన్ని తన జీవితంగా మార్చుకున్నారు. లెజెండరీ సింగర్‌గా ఎదిగారు. 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆమె అభిమానులు ఆమెను అప్పాజీ అని పిలుస్తుంటారు.

బెనారస్ గాయనిగా తన తుది శ్వాస విడిచే వరకు ఆమె పాడుతూనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆమెను పాడటం ఆపాలని వైద్యులు సూచించినప్పటికీ ఆమె అస్సలు వినలేదు. తినటం, నడవటం, శ్వాస పీల్చుకోవటం ఆగనప్పుడు తాను పాడటం ఎందుకు ఆపాలని ఆమె తరచూ చెబుతుండేవారు. గిరిజాదేవి మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఆమె పాటలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles