Third Biopic Announcement on Senior NTR | ఎన్టీఆర్ పై మూడో బయోపిక్.. సీనియర్ నటికి సంబంధం ఏంటంటే...

Another biopic on ntr

NTR Biopic, NTR Another Biopic, Vani Viswanath NTR Biopic, Tamil Nadu Telugu Yuvashakti president Kethireddy Jagadeeswara Reddy, Kethireddy Jagadeeswara Reddy NTR Biopic, Kethireddy Jagadeeswara Reddy Vani Vishwanath

Another Biopic Announced on NTR. Tamil Nadu Telugu Yuvashakti president Kethireddy Jagadeeswara Reddy announced Biopic on NTR. Vani Viswanath play crucial role and also co produce this movie. Already Varma and Teja fixed for NTR Biopics.

ఎన్టీఆర్ పై మరో బయోపిక్!

Posted: 10/25/2017 10:28 AM IST
Another biopic on ntr

దివంగత దిగ్గజ నటుడు నందమూరి తారకరామా రావు బయోపిక్ ను ఏ క్షణన తనయుడ బాలకృష్ణ ప్రకటించాడో గానీ.. ఆ తర్వాత అసలైన మజా మొదలైంది. వెంటనే సీన్ లోకి వచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తానే ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తానంటూ ఓ ఆడియో మెసేజ్ తో ప్రకటించాడు.

అయితే తన తండ్రి బయోపిక్ లో తానే నటిస్తానని, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని బాలయ్య చెప్పటంతో వర్మ మరో దారి చూసుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ప్రకటించి పెద్ద బాంబునే పేల్చాడు. టైటిల్ తోనే ఇందులో కాంట్రవర్సీలు ఉంటాయని ప్రకటించిన వర్మ.. టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యాడు. హెచ్చరికలు వచ్చి పడినప్పటికీ.. చివరకు సినిమా తీస్తానని ఎట్టకేలకు ప్రకటించాడు.

దర్శకుడు తేజ మాత్రం బాలయ్య చిత్రానికి ఖరారయ్యాడు. ఈ రెండు వెలుగులో ఉండగానే.. ఇప్పుడు ఎన్టీఆర్ పై మరో బయోపిక్ ప్రకటన టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, తాను ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఓ సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ఆయన చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు వాణి విశ్వనాథ్ సహనిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారంట. అయితే అధికారికంగా ఆమె నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles