AR Rahman Almost quit Sye Raa Narasimha Reddy | సైరా నుంచి రెహమాన్ అవుట్.. గొడవ ఏంటో?

Music director change for sye raa movie

Sye Raa Narasimha Reddy, AR Rahman, Chiranjeevi, SS Thaman, Rahman Misunderstanding Chiru Movie

AR Rahman Almost to quit Sye Raa Narasimha Reddy. There seems to be a misunderstanding due to which the award-winning composer may exit Sye Raa Narasimha Reddy. Thaman may get that Mega Offer due to Background Score of Motion Poster.

సైరా నుంచి రెహమాన్ దాదాపు అవుట్

Posted: 10/04/2017 02:21 PM IST
Music director change for sye raa movie

అనుకున్నదంతా అయ్యింది. ఆ మధ్య చెప్పుకున్నట్లు సైరా నుంచి ఏ ఆర్ రెహమాన్ బయటకు వెళ్లిపోయినట్లు పక్కా సమాచారం అందుతోంది. ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ తో పాటు, పింక్ విల్లా కూడా ఈ మేరకు కథనాలు ప్రచురించాయి.

చిత్ర యూనిట్ తో చిన్న చిన్న అపార్థాల మూలంగానే రెహమాన్ సైరా నుంచి బయటకు వచ్చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ గొడవ ఏంటన్నదానిపై మాత్రం అవి స్పష్టతను ఇవ్వలేకపోయాయి. గతంలోనే ఆయన బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించినప్పటికీ.. వెంటనే అది నిజం కాదని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పుడు ఒక రోజు గడిచినప్పటికీ ఎటువంటి దానిని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాకపోవటంతో ఆస్కార్ విన్నర్ ఎగ్జిట్ దాదాపు ఖాయమనే అనుకోవాలి.

అతనికే అవకాశం?

చిత్రం అనౌన్స్ మెంట్ జరిగిన సమయంలో సైరా మోషన్ పోస్టర్ కు ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పైగా దానికే ఎక్కువ మార్కులు పడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో సైరా సంగీత బాధ్యతలను అతనికే అప్పగిస్తారా? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ థమన్ ఆ అవకాశం అందిపుచ్చుకుంటే మాత్రం భారీ బడ్జెట్ చిత్రం కావటంతో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది.

 

సై రా కోసం బాలీవుడ్ డిజైనర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles