Top designer on board for Chiru Sye Raa Movie.

Discerning designer drafted for sye raa

Chiranjeevi, Sye Raa Narasimha Reddy Movie, Bollywood Designer, Anju Modi, Sushmita Konidela, Chiru 151 Movie

Mega Star Chiranjeevi's Sye Raa has been continuing to make news for all the right reasons. Senior and Bollywood top stylist Anju Modi is on board for the project and she is going to design the outfits and the ornaments for Chiranjeevi and the other artists of the film. A lot of research work is going through the process and she has earlier worked for the films like Bajirao Mastani and Ram Leela.

సై రా కోసం బాలీవుడ్ డిజైనర్ అంజూ మోదీ

Posted: 09/05/2017 04:04 PM IST
Discerning designer drafted for sye raa

మెగాస్టార్ 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన, ఆ కాలం నాటి వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఉంటుంది. ప్రేక్షకులు ఆ కాలంలోకి అడుగుపెట్టేంత సహజంగా అందుకు సంబంధించిన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది.

ఇక ఇప్పుడు లోకేషన్ల వంతు ముగిసినట్లు సమాచారం. రాజస్థాన్, కేరళ, మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సెట్స్ లో షూట్ చేయబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పని చేయబోతున్న ఈ చిత్రం కోసం ఆర్ట్ వర్క్ కూడా గ్రాండియర్ గానే ఉండబోతుంది. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాల్లో కాస్ట్యూమ్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఆయా పాత్రలు ఆ కాలం నాటి వేషధారణతో మెప్పించవలసి ఉంటుంది.

ఇది చాలా కష్టతరమైన బాధ్యత. అందువలన ఈ విషయంలో బాగా అనుభవం కలిగిన 'అంజూ మోడి'ని రంగంలోకి దింపారు. 'రామ్ లీలా' .. 'బాజీరావ్ మస్తాని' వంటి బాలీవుడ్ సినిమాలకు పనిచేసి మెప్పించిన గొప్ప డిజైనర్ ఆమె. 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయంలో ఆమెకి సాయంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఉంటుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles