Clash Between Pawan and Mahesh Fans Kakinada

Flexi war between mahesh and pawan

Pawan Kalyan, Mahesh Babu, Flexi War, Kakinada

Pawan Kalyan And Mahesh Babu Fans Fight in kakinada. Flexi War in Vinayaka Immersion Reached to Police Station.

కొట్టుకున్న పవన్-మహేష్ ఫ్యాన్స్... డీఎస్పీ క్లాస్

Posted: 09/08/2017 05:14 PM IST
Flexi war between mahesh and pawan

హీరోలు వద్దని వారిస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటూనే ఉంటున్నారు.  టాలీవుడ్ అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద అలజడినే రేపారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ముమ్మిడివరం అనంతవరంలో మహేష్ ఫ్యాన్స్ బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ నాశనం అయ్యింది. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

కావాలనే చేశారంటూ ఇరు వర్గాలు కొట్టేసుకున్నాయి. ఆరుగురికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ప్రసన్న కుమార్ ఇరు వర్గాలు గురువారం సాయంత్రం స్టేషన్ లో కూర్చోబెట్టి సెటిల్ మెంట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘర్షణలు తలెత్తకుండా వాళ్ల నుంచి హామీ తీసుకున్నాడు.

అయితే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతగా కావాలంటే తమ అభిమాన హీరోల తరపున సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles