ప్రపంచంలోనే కాస్ట్ లీ విల్లా.. హీరోయిన్ జస్ట్ మిస్ | Hollywood Actress Not Purchasing Most Expensive Villa

All hollywood eyes on bel air costly villa

Costly Villa Hollywood, Hollywood Costly Home, Costly Villa Actress, Hollywood Actress Costly Villa, Dean McKillen, Bel Air Mansion, Beyonce Bel Air Mansion

Jay-Z And Beyonce Reportedly Dropped $90 Million For A 30,000 Square Foot Mansion In Bel-Air. Designed by Dean McKillen, the house is more of a compound, comprised of six structures on 30,000 square feet,

హాలీవుడ్ లో కాస్ట్ లీ భవనం.. ఎవరికి సొంతం?

Posted: 08/02/2017 09:56 AM IST
All hollywood eyes on bel air costly villa

హాలీవుడ్‌ లో ఈ యేడాది మొదటి నుంచి ఓ హాట్ టాపిక్ పై చర్చ నడుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఓ విలాసవంతమైన భవనం ను సొంతం చేసుకునేందుకు పలువురు బడా సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ దాని ఖరీదెంతో తెలుసా? అక్షరాల 250 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 16026250000 రూపాయలు అన్నమాట.

రియల్‌ ఎస్టేట్‌ డీలర్‌ బ్రూస్‌ మెకవ్‌ స్కీ సిద్ధం చేసిన భవంతి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. విలాసవంతమైన భవంతుల రూపశిల్పిగా రియల్ ఎస్టేట్ డీలర్ బ్రూస్ మెకవ్ స్కీకి మంచి పేరుంది. పైగా అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే బెల్ ఎయిర్ ప్రాంతంలో ఇది ఉండటంతో మరింత ఆసక్తిని కలిగిస్తూ వస్తోంది.

మొత్తం నాలుగంతస్తుల భవంతిలో ఓ ప్రైవేటు హెలిప్యాడ్ సహా 12 పడక గదులు, 21 బాల్‌ రూమ్‌ లు, 3 కిచెన్‌ లు ఉన్నాయి. వైశాల్యం 38 వేల చదరపు అడుగులు కావడం విశేషం. అద్భుతమైన ల్యాండ్ స్కేప్ తో ఆ భవంతి ఆకట్టుకుంటోంది. లివ్‌ ఇన్‌ చెఫ్‌ తో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఈ భవంతి లో ఇంకా అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ మధ్య నటి బేయోన్స్ ఆమె భర్త, గాయకుడు జే జెడ్‌ దంపతులు ఈ విల్లాను సొంతం చేసుకునేందుకు ట్రై చేసి కుదరకపోవటంతో చివరకు అదే లాస్ ఏంజెల్సి లో 90 మిలియన్ డాలర్లకు మరో భవనంను కొనుగోలు చేసేశారు. ఇక ఇంద్రభవనాన్ని తలపించే బెల్ ఎయిర్ విల్లాను ఎవరు సొంతం చేసుకుంటారన్న చర్చ హాలీవుడ్ తారల్లో నడుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  Costly Villa  Bel Air Mansion  

Other Articles