జోగేంద్ర కోసం బాహుబలి లాంటి సాంగ్ | Jogendra Song Reminds Saahore Baahubali

Nene raju nene mantri song teaser release

Rana, Nene Raju Nene Mantri, Nene Raju Nene Mantri Song, Jogendra Jogendra Song, Jogendra Song Baahubali, Rana Version of Baahubali, Saahore Baahubali Rana, Naan Aanaiyittal, Rana Naan Aanaiyittal, Naan Aanaiyittal Song, Naan Aanaiyittal Jogendra Song

Nene Raju Nene Mantri Jogendra Song Released. Rana Fans compared this song with Saahore Baahubali lyrics.

జోగేంద్ర సాంగ్ టీజర్ రిలీజ్.. ఆడియో నేడే!

Posted: 08/02/2017 10:42 AM IST
Nene raju nene mantri song teaser release

బాహుబలి 2 తర్వాత రానా సోలో హీరో గా చేస్తున్న మరో చిత్రం నేనే రాజు నేనే మంత్రి. మధ్యలో ఘాజీ చేసినప్పటికీ అది బాహుబలి కంటే ముందే రావటంతో ఇప్పుడు రానాకు అసలైన పరీక్ష మొదలైనట్లేనని చెప్పుకుంటున్నారు. ఆగస్ట్ 11న తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది.

ఇక రీసెంట్ గా జోగేంద్ర సాంగ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనూప్ అందించిన ట్యూన్ దానికి తగ్గట్లు వాయిస్ ఓవర్, రానా క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఒక రకంగా బాహుబలి 2 లోని సాహోరే బాహుబలి సాంగ్ తో కంపేరిజన్ చేస్తున్నారు పలువురు. బ్యాగ్రౌండ్ స్కోర్ తోపాటు లిరిక్స్ మాత్రం దండాలయ్య సాంగ్ కు దగ్గరగా ఉండటం విశేషం. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో పాటు రానా అభిమానులకు మాంచి కిక్ ఇస్తుంది. రానా ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు.

 

పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. దీనికి జోగేంద్ర యువగర్జన అనే టైటిల్ పెట్టి మరింత ఎట్రాక్షన్ తీసుకొచ్చారు మేకర్లు. కాజల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తో మళ్లీ ఫామ్ లోకి రావాలని దర్శకుడు తేజ కసి మీద ఉన్నాడు. తమిళ్ లో నాన్ ఆనయిట్టాల్’(నేను ఆదేసిస్తే..) పేరుతో సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Nene Raju Nene Mantri  Jogendra Song  

Other Articles