వాళ్లతో ఫోటోలే నటి చావుకు కారణమా? | Singer cum Actor Commit Suicide Husband held

Actress commits suicide as husband suspects

Bidisha Bezbaruah, Assam Singer Suicide, Jagga Jasoos Actress Suicide, Actress Cum Singer Suicide, Bidisha Bezbaruah Husband, Bidisha Bezbaruah Death, Bidisha Bezbaruah Suicide, Actress Bidisha Bezbaruah, Singer Bidisha Bezbaruah, Bidisha Bezbaruah Husband Nisheet, Bidisha Bezbaruah Murder, Actress Harass Suicide, Husband Suspect Actress Suicide, Nisheet Arrest, Singer Husband Arrest

Assamese singer Bidisha Bezbaruah commits suicide in Gurgaon on Monday, was found dead at her residence in Gurgaon’s Sushant Lok. Sources claim there were problems in her one-year-old marriage. Husband Nisheet held for torture her.

భర్త అనుమానంతోనే హీరోయిన్ ఉరి?

Posted: 07/19/2017 01:06 PM IST
Actress commits suicide as husband suspects

అస్సామీ నటి, గాయని, బిదిశా బెజ్ బారువా ఆత్మహత్యతో బాలీవుడ్ ఒక్కసారి షాక్ కు గురైంది. సోమవారం సాయత్రం గురుగ్రామ్, శుశాంత్ లోక్ ప్రాంతంలోని తన ఇంట్లో బిదిశ ఫ్యానుకు ఉరివేసుకుని మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడితోనే ఆమె చనిపోయిందంటూ ఆమె భర్త నితీశ్ మీడియాకు ముందుగా వెల్లడించగా, ఆమె తండ్రి మాత్రం మరో వాదన తెరపైకి తెచ్చాడు.

ఆమె ఆత్మహత్య వెనుక భర్త నితీశ్ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఎన్నో స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ లో కనిపించి మెప్పించిన ఆమె, రీసెంట్ గా ణబీర్ కపూర్ చిత్రం 'జగ్గా జాసూస్'లో నటించింది. అయితే నిత్యం ఆమె వెంట ఉండే భర్త అనుమానంతో ఆమెను హింసించేవాడని, అందుకే ఆమె చనిపోయిందని బిదిశా తండ్రి చెబుతున్నాడు.

నితీశ్, బిదిశా ది లవ్ మ్యారేజ్. అయితే వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సీరియళ్లలో, సినిమాల్లో తన తోటి నటీనటులతో ఆమె క్లోజ్ గా మూవ్ అవుతుండటం, వాళ్ల ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టడంపై బిదిశను నితీశ్ టార్చర్ పెట్టేవాడంట. అతని మొబైళ్లలో మెసేజ్ లు, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో భార్యతో జరిగిన వివాదం ప్రాథమిక సాక్ష్యాలుగా భావించిన పోలీసులు అసలు నిజం రాబట్టే పనిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bidisha Bezbaruah  Commits Suicide  Husband Arrest  

Other Articles