పటేల్ సర్ డిజాస్టర్.. భాయ్ కు ఏ రేంజ్ లో దెబ్బడిందంటే... | Comeback again as Hero Lost Huge Money

Patel sir big loss with re entry

Jagapathi Babu, Jagapathi Babu Patel SIR Movie, Patel SIR Collections, Patel SIR Disaster, Patel SIR Jagapathi Babu Lost, Jagapathi Babu Loss, Patel SIR Poor Talk, Patel SIR Final Verdict

Japapathi babu Huge Lost on 'Patel S.I.R'. Movie was produced by Sai Korrepati's banner, but it is open secret that Jagapathi Babu invested his money in this film and that he didn't take remuneration either.

పటేల్ సర్ తో ఏం ఒరిగింది జగ్గూ భాయ్?

Posted: 07/19/2017 11:36 AM IST
Patel sir big loss with re entry

విలాసవంతమైన అలవాట్లతో ఆర్థిక నష్టాల పాలై, వాటి నుంచి కోలుకునేందుకు ఒకానోక టైంలో ఎలాంటి పాత్రలైనా చేసేందుకు ముందుకు వచ్చాడు సీనియర్ నటుడు జగపతి బాబు. అయితే అదృష్టం బాగుండి నెగటివ్ రోల్స్ తో కెరీర్ సూపర్ టర్న్ తీసుకుంది. ఓవైపు విలన్ పాత్రలతోపాటు హీరో ఫాదర్ రోల్స్ తో మళ్లీ బిజీ అయిపోయాడు. అంతా సవ్యంగా జరుగుతున్న టైంలో మళ్లీ హీరో అంటూ పటేల్ సర్ తో ముందుకు వస్తే.. తీరా సీన్ దారుణంగా రివర్స్ అయ్యింది.

నిజానికి పటేల్ సర్ కు నిర్మాత సాయి కొర్రపాటి అయినప్పటికీ, తన దగ్గరున్నంత డబ్బును జగపతి బాబు పెట్టుబడి పెట్టాడన్నది ఓపెన్ సీక్రెట్. అంతేకాదు సినిమాకు రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. హంగ్ కాంగ్ మూవీ వెంజెన్స్ కు ఇది రీమేక్. సినిమాపై బోలెడు ఆశలు కూడా పెట్టుకున్నాడు. మేక్ ఓవర్, స్టైలిష్ విజువల్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయ్ కూడా.

అయితే కథ, కథనాలు మరీ దారుణంగా ఉండటంతో అంతకంటే దారుణమైన రేటింగ్ లే సినిమాకు వచ్చాయి. మౌత్ టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కలెక్షన్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో డిజాస్టర్ నే జగ్గూ భాయ్ అందించాడు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా వద్దని వారిస్తున్నా వినకుండా ఉన్నదంతా ఊడ్చిపెట్టి జగపతి దారుణంగా చేతులు కాల్చుకున్నాడని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కెరీర్ కు వచ్చిన నష్టం ఏం లేకపోయినా మున్ముందు అయినా జాగ్రత్తగా ఉండి తప్పులు రిపీట్ చేయొద్దని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  Patel SIR  Huge Loss  

Other Articles

Today on Telugu Wishesh